క్రీడాభూమి

ప్రో కబడ్డీ లీగ్ టైటాన్స్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 7: ప్రో కబడ్డీ లీగ్‌లో గురువారం పునేరీ పల్టన్‌ను ఎదు ర్కొన్న తెలుగు టైటాన్స్ జట్టు గొప్పగా పోరాడినప్పటికీ, ఐదు పాయంట్ల తేడా తో ఓటమిపాలైంది. కాగా, బెంగళూరు వారియర్స్, దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన పోరు టైగా ముగిసింది. ఈ రెండు మ్యాచ్‌లు చివరి వరకూ ఉత్కంఠగా సాగడం విశేషం. మొదటి మ్యాచ్‌లో పునేరీ పల్టన్‌తో టైటాన్స్ అమీతుమీ తే ల్చుకోవడానికి సర్వశక్తులు ఒడ్డింది. అయతే, ఈ జట్టు 37 పాయంట్లకు పరిమి తంకాగా, పునేరీ పట్లన్ 42 పాయంట్లు చేసింది. ఆ జట్టు తరఫున దీపక్ హూడా 9 పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సందీప్ నర్వాల్, గిరీష్ మారుతి చెరి ఏడు పాయంట్లు సాధించగా, మోను ఐదు పాయంట్లను తన ఖాతాలో వే సుకున్నాడు. తెలుగు టైటాన్స్‌కు రాహుల్ చౌదరి 9 పాయంట్లు అందించాడు. మొసెన్ ముగ్‌సొద్లు ఆరు పాయంట్లు చేయగా, సోమ్‌వీర్, ఎలంగేశ్వరన్ చెరి నాలుగు పాయంట్లు చేశారు. టైటాన్స్ ఆటగాళ్లు ప్రత్యర్థికి దీటుగా పాయంట్లు సంపాదించలేకపోయనా, చివరి వరకూ పోరాడడం ద్వారా అభిమానులను ఆకట్టుకుంది. ఇలావుంటే, బెంగళూరు వారియర్స్, దబాంగ్ ఢిల్లీ చెరి 31 పా యంట్లు చేయడంతో మ్యాచ్ టై అయంది. బెంగళూరు తరఫున మనీందర్ సిం గ్ 13 పాయంట్లు సాధించాడు. ఢిల్లీ ఆటగాళ్లలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆనం ద్ పాటిల్ 9 పాయంట్లు చేశాడు. రోహిత్ బలియన్ ఏడు పాయంట్లు సాధిం చాడు. మొత్తం మీద ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయ.