క్రీడాభూమి

కోహ్లీ స్వేచ్ఛనిచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, సెప్టెంబర్ 6: బౌలర్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ తగినంత స్వేచ్ఛనిచ్చాడని, అందుకే, ఎలాంటి ఒత్తిడి లేకుండా బంతులు వేయగలిగామని భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ఆటగాళ్ల అభిప్రాయాలకు విలువనిచ్చి, తమదైన రీతిలో ఆడే అవకాశాన్ని కెప్టెన్ ఇచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ నూటికి నూరుశాతం సేవలు అందిస్తారని వ్యాఖ్యానించాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన ఏకైక టి-20 ఇంటర్నేషనల్‌లో రెండు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ తనకు కోహ్లీ నుంచి అద్భుతమైన ప్రోత్సాహం లభిస్తున్నదని చెప్పాడు. ప్రతి ఆటగాడికి మద్దతునిస్తే, సహజంగానే జట్టులో ఐకమత్యం పెరుగుతుందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ ప్రతి ఆటగాడితోనూ చర్చిస్తాడని, తమ నుంచి అతను ఏం కోరుకుంటున్నదీ స్పష్టంగా చెప్తాడని కుల్దీప్ అన్నాడు. అదే విధంగా అతని నుంచి లభించే మద్దతుపైనా స్పష్టనిస్తాడని పేర్కొన్నాడు. ఎక్కడా అభిప్రాయ భేదాలకు తావులేకపోవడంతో, టీమిండియా సమష్టిగా పోరాడి, అద్భుత విజయాలను నమోదు చేయగలుగుతున్నదని అన్నాడు. శ్రీలంకతో మొదటి రెండు టెస్టుల్లో తనకు అవకాశం లభించలేదని, చివరిదైన మూడో టెస్టులో బరిలోకి దిగానని అతను గుర్తుచేశాడు. అదే విధంగా చివరి రెండు వనే్డలతోపాటు, టి-20 మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించిందన్నాడు. చేతికి అందిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని అన్నాడు. జట్టులో స్థిరమైన స్థానం సంపాదించడం, దేశానికి ఉత్తమ సేవలు అందించడం తన లక్ష్యాలని కుల్దీప్ పేర్కొన్నాడు.