క్రీడాభూమి

గౌహతి, తిరువనంతపురంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: గౌహతి, తిరువనంతపురం నగరాలు మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ముస్తాబవుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగే హోం సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. చెన్నై, కోల్‌కతా, ఇండోర్, బెంగళూరు, నాగపూర్ నగరాల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వనే్డ మ్యాచ్‌లు జరుగుతాయి. అదే జట్టుతో మూడు టి-20 మ్యాచ్‌లు రాంచీ, గౌహతి, హైదరాబాద్ నగరాల్లో ఉంటాయి. కాగా, న్యూజిలాండ్ జట్టు భారత్‌లో మూడు వనే్డలు, మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఆసీస్, కివీస్ జట్లు వామప్ మ్యాచ్‌ల్లోనూ పాల్గొంటాయి.
బిసిసిఐ ప్రకటించిన షెడ్యూల్:
ఆస్ట్రేలియాతో..
సెప్టెంబర్ 12: వామప్ మ్యాచ్ (చెన్నై), సెప్టెంబర్ 17: మొదటి వనే్డ (చెన్నై), సెప్టెంబర్ 21: రెండో వనే్డ (కోల్‌కతా), సెప్టెంబర్ 24: మూడో వనే్డ (ఇండోర్), సెప్టెంబర్ 28: నాలుగో వనే్డ (బెంగళూరు), అక్టోబర్ 1: ఐదో వనే్డ (నాగపూర్). అక్టోబర్ 7: మొదటి టి-20 (రాంచీ), అక్టోబర్ 10: రెండో టి-20 (గౌహతి), అక్టోబర్ 13: మూడో టి-20 (హైదరాబాద్).
న్యూజిలాండ్‌తో..
అక్టోబర్ 17: మొదటి వామప్ మ్యాచ్ (ముంబయిలో), అక్టోబర్ 19: రెండో వామప్ మ్యాచ్ (ముంబయిలో), అక్టోబర్ 22: మొదటి వనే్డ (ముంబయి), అక్టోబర్ 25: రెండో వనే్డ (పుణే), అక్టోబర్ 29: మూడో వనే్డ (కేంద్రం ఇంకా ఖరారు కాలేదు/ దీనిని ఉత్తర ప్రదేశ్ క్రికెట్ సంఘం నిర్వహిస్తుంది), నవంబర్ 1: మొదటి టి-20 (న్యూఢిల్లీ), నవంబర్ 4: రెండో టి-20 (రాజ్‌కోట్), నవంబర్ 7: మూడో టి-20 (తిరువనంతపురం).

చిత్రం..గౌహతి క్రికెట్ స్టేడియం