క్రీడాభూమి

ఫెదరర్‌కు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 7: ఈసారి యుఎస్ ఓపెన్‌ను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ నుంచే నిష్క్రమించాడు. అర్జెంటీనాకు చెందిన జెయింట్ కిల్లర్ జువాన్ మార్టిన్ డెల్ పొట్రో 7-5, 3-6, 7-6, 6-4 స్కోరుతో ఫెదరర్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. 2009లో యుఎస్ ఓపెన్ సాధించిన అతను ఆతర్వాత ఇప్పటి వరకూ రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకోలేకపోయాడు. గతంలో ఐదు పర్యాయాలు ఈ ట్రోఫీని కైవసం చేసుకున్న ఫెదరర్‌ను ఓడించడం ద్వారా ఈసారి టైటిల్ రేసులో తాను కూడా ఉన్నానని నిరూపించాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు రాఫెల్ నాదల్ 6-1, 6-2, 6-2 తేడాతో ఆండీ రుబ్లెవ్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేశాడు. నిజానికి యుఎస్ ఓపెన్‌లో చిరకాల ప్రత్యర్థులు ఫెదరర్, నాదల్ మొట్టమొదటిసారి ఢీకొనే అద్భుత ఘట్టాన్ని చూడాలని అభిమానులు ఆశించారు. కానీ, అటు ఫెదరర్, ఇటు అభిమానుల ఆశలపై డెల్ పొట్రో నీళ్లు చల్లాడు. నాదల్‌తో సెమీ ఫైనల్‌ను ఖాయం చేసుకున్నాడు. కాగా, మరో సెమీ ఫైనల్‌లో కెవిన్ ఆండర్సన్, పాబ్లో కరొనొ బస్టా తలపడతారు.

చిత్రాలు..జువాన్ డెల్ పొడ్రో *రోజర్ ఫెదరర్