క్రీడాభూమి

స్నేహితుల సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ను స్నేహితుల సవాల్‌గా పేర్కోవచ్చు. ఈ పోరులో అమీతుమీ తేల్చుకోవడానికి బరిలోకి దిగిన అమెరికన్లు స్లొయెన్ స్టెఫెన్స్, మాడిసన్ కీస్ మధ్య బలమైన స్నేహ బంధం ఉంది. ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని చాలాసేపు అలానే ఉండిపోయారు. అనంతరం, బహుమతుల ప్రదానం మొదలయ్యే వరకూ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. 3.7 మిలియన్ డాలర్ల (సుమారు 23.67 కోట్ల రూపాయలు) విన్నర్స్ చెక్కును అందుకున్నప్పుడు, మాడిసన్ కీస్ దానిని లాక్కునే ప్రయత్నం చేస్తుందనే భయాన్ని నటిస్తూ, చేతిని దూరంగా ఉంచి ఆర్థర్ అషే స్టేడియంలో స్టెఫెన్స్ నవ్వులు పూయించింది.