క్రీడాభూమి

మీ సామర్థ్యానికి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 10: భారత్‌తో జరగబోయే వనే్డ సిరీస్ జట్టులోని ప్రతి ఒక్కరి సామర్థ్యానికి పరీక్ష పెడుతుందని సహచరులకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హెచ్చరించాడు. భారత్‌ను ఓడిస్తే, ఆసీస్ చరిత్రలోనే అత్యుత్తమ క్రికెటర్లుగా నిలిచిపోతారని ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జట్టు సభ్యులకు స్మిత్ సూచించాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియాతో సిరీస్‌ను సాధించడం అనుకున్నంత సులభం కాదన్నాడు. తమను అందరూ ‘అండర్ డాగ్స్’గానే పేర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో జట్టులోని ఆటగాళ్లంతా సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత్‌లో మ్యాచ్‌లు ఆడాలంటే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలగాలని అన్నాడు. స్పిన్ బౌలింగ్‌ను తాను బాగా ఆడగలనని అన్నాడు. భారత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై తనకు స్పష్టత ఉందన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ముంద్తు ప్రణాళిక నుంచి వైదొలగకుండా, దానికే కట్టుబడి ఉండడమే కీలకమని చెప్పాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, భారత్ లాంటి దేశాల్లో పర్యటించినప్పుడే, ఆసీస్ ఆటగాళ్ల వ్యక్తిత్వాలు బయటపడతాయని వ్యాఖ్యానించాడు. ఒక కెప్టెన్‌గా అందరి బలాబలాల గురించి తెలియడం తనకు అత్యవసరమని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు సిద్ధంకావడంలో భారత్ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. టీమిండియాకు గట్టిపోటీనిస్తామని అతను ధీమా వ్యక్తం చేశాడు.