క్రీడాభూమి

మళ్లీ జట్టులోకి యాదవ్, షమీ ఇన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు టీమిండియాను భారత జాతీయ సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. రొటేషన్ విధానాన్ని అనుసరించి, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చారు. శ్రీలంకతో జరిగిన వనే్డ, టి-20 సిరీస్‌లకు ఎంపిక కాని ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ మళ్లీ జట్టులోకి వచ్చారు. శ్రీలంక టూర్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టిన యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈనెల 17న చెన్నైలో జరిగే మ్యాచ్‌లో భారత్‌లో పర్యటనను ఆస్ట్రేలియా మొదలు పెడుతుంది. మిగతా నాలుగు వనే్డలు వరుసగా కోల్‌కతా, ఇండోర్, బెంగళూరు, నాగపూర్ నగరాల్లో జరుగుతాయి. శ్రీలంక టూర్‌లో టీమిండియా అన్ని మ్యాచ్‌లనూ గెల్చుకున్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ వనే్డ సిరీస్‌ను 5-0 తేడాతో గెల్చుకుంది. ఏకైక టి-20 మ్యాచ్‌ని కూడా తన ఖాతాలో వేసుకొని, క్లీన్‌స్వీప్‌ను సంపూర్ణం చేసింది.
ఇలావుంటే, ఆ టూర్‌లో ఆడే అవకాశం దక్కించుకోలేకపోయిన ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీకి రొటేషన్ విధానాన్ని అనుసరించి, ఆసీస్‌తో జరిగే మొదటి మూడు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించినట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ లక్నో నుంచి ఫోన్‌లో పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. లంక టూర్‌లో అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్ వంటి యువ బౌలర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. భవిష్యత్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని, బెంచ్ బలాన్ని అంచనా వేసేందుకు ప్రయోజాలు చేస్తున్నట్టు చెప్పాడు. అందులో భాగంగానే, ఆసీస్‌తో మొదటి మూడు వనే్డలకు అక్షర్, చాహల్‌ను కొనసాగిస్తున్నట్టు వివరించాడు.
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాధవ్, అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ.

చిత్రాలు..ఉమేష్ యాదవ్ *మహమ్మద్ షమీ