క్రీడాభూమి

ఒలింపిక్స్ హక్కులపై అధికారిక ముద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిమా, సెప్టెంబర్ 10: ఒలింపిక్స్ హక్కులపై అధికార ముద్ర వేయడంతోపాటు, వివిధ అంశాలను చర్చించి, తీర్మానాలను ఆమోదించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) వారం రోజుల సర్వసభ్య సమావేశం సోమవారం ఇక్కడ మొదలుకానుంది. 2024 ఒలింపిక్స్‌ను పారిస్‌కు, 2028 ఒలింపిక్స్‌ను లాస్ ఏంజిల్స్‌కు ఇప్పటికే ఐఒసి ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి, ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశాన్ని దక్కించుకోవాలని పట్టుబట్టి కూర్చున్నప్పటికీ, చివరి క్షణాల్లో తన నిర్ణయాన్ని మార్చుకున్న లాస్ ఏంజిల్స్ ఇప్పుడు 2028 ఒలింపిక్స్‌ను విజయవంతం చేయడానికి కసరత్తు ప్రారంభించింది. పారిస్‌కు 2024 ఒలింపిక్స్ ఖాయమయ్యాయి. కాగా, ఈ రెండు నగరాలను ఆతిథ్య దేశాలుగా ధ్రువీకరిస్తూ ఐఒసి ఒక తీర్మానాన్ని ఆమోదించనుంది. 2014 ఒలింపిక్స్ హక్కుల కోసం మొదటి ఐదు దేశాలు బరిలో ఉన్నప్పటికీ, చివరికి రెండు మాత్రమే మిగలడంతో బిడ్స్ వ్యవహారం ఆసక్తి కరంగా మారిన విషయం తెలిసిందే. బుడాపెస్ట్ (హంగరీ), రోమ్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ) వివిధ కారణాలతో ముందుగానే రేసు నుంచి వైదొలగడంతో, పోటీలో లాస్ ఏంజిల్స్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్) మిగిలాయి. ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడానికి వివిధ దేశాలు భయపడుతున్న నేపథ్యంలో, మూడు దేశాలు వెనకడుగు వేయడం అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి)ను సహజంగానే ఆందోళనకు గురిచేసింది. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందోనన్న భయంతో, 2024 బిడ్‌ను పొందడంలో విఫలమైన రెండో నగరానికి 2028 ఒలింపిక్స్‌ను కేటాయిస్తామని ముందుగానే ప్రకటించింది. అయితే, ప్రారంభంలో ఈ ప్రతిపాదనకు అమెరికా సానుకూలంగా స్పందించలేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగిన ఐఒసి ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని లాస్ ఏంజిల్స్‌కు పంపింది. ఒలింపిక్స్ నిర్వాహణకు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పనులు, భద్రత తదితర అంశాలను పరిశీలించడంతోపాటు, 2024 ఒలింపిక్స్ పోటీ నుంచి వైదొలగితే, 2028 ఒలింపిక్స్‌ను అప్పగిస్తామని అమెరికా ఒలింపిక్ సంఘం (యుఎస్‌ఒఎ) అధికారులకు నచ్చచెప్పింది. సుదీర్ఘ చర్చల అనంతరం 2028లో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అమెరికా అంగీకరించింది. ఫలితంగా 2024 ఒలింపిక్స్‌కు పారిస్ ఎంపికైంది. ఈ రెండు నిర్ణయాలకు ఐఒసి సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర పడాల్సి ఉంది. అయితే, ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తికావడంతో, పారిస్‌కు 2024, లాస్ ఏంజిల్స్‌కు 2028 ఒలింపిక్స్ హక్కులను ఇవ్వనున్నట్టు ఐఒసి లాంఛనంగా ఒక ప్రకటన చేస్తుంది. ఇలావుంటే, ముందుగా అనుకున్నట్టు 2024లో కాకుండా ఆతర్వాత మరో నాలుగేళ్లకు ఒలింపిక్స్‌ను నిర్వహించాల్సి ఉండడంతో, లాస్ ఏంజిల్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఐఒసి సమావేశంలో చర్చకు స్వీకరించడానికి వీలుగా ఒప్పందాన్ని సిద్ధం చేసింది. 250 మిలియన్ డాలర్ల ధరావతును చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.
అదే విధంగా స్టేడియాలు, స్పోర్ట్స్ విలేజ్‌తోపాటు ఇతరత్రా నిర్మాణాలకు తుది రూపాన్ని ఇస్తున్నది. అంచనా వ్యయానికి, చేసిన ఖర్చుకు ఎక్కడా పొంతన లేకుండా పోతుండడంతో అలాంటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. మరోవైపు పారిస్ కూడా జమాఖర్చులు, ఇతరత్రా అంశాలపై ఐఒసి సమావేశంలో ప్రెజెంటేషన్‌ను ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి పోటీలో ఉన్న దేశాలు ఒలింపిక్స్ కోసం కేటాయించిన బడ్జెట్, తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న నిర్మాణాలు, వౌలిక సదుపాయాల కల్పన, రవాణా వంటి అనేకానే అంశాలపై ఇచ్చిన వివరాలను పరిశీలించిన తర్వాత ఐఒసి తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే వేదికలు ఖరారు కావడంతో, చర్చ, తీర్మానాలు నామమాత్రంగా మారాయి.