క్రీడాభూమి

ఆ ఇద్దరూ.. ఘనులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: నాయకత్వం విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్ ఇద్దరూ సమానులేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. అయితే వన్‌డే బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ స్మిత్‌కన్నా కాస్త మెరుగని, స్మిత్ టెస్టుల్లో కోహ్లీకన్నా మెరుగని ఆయన అన్నాడు. ‘విరాట్ మెరుగైన వన్‌డే బ్యాట్స్‌మన్, స్మిత్ టెస్టుల్లో మెరుగైన వాడు. కెప్టెన్సీ విషయానికి వస్తే ఇద్దరూ సమానులే. అంతేకాదు వాళ్లు రోజురోజుకు మెరుగుపడుతున్నారు. అయితే కెప్టెన్‌గా మీరెన్ని రన్స్ చేశారనే దానికన్నా మీ జట్టు గెలిచిందా లేదా అనేదే ముఖ్యం’ అని భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరిగే అయిదు వన్‌డేల సిరీస్‌కు టీవీ ఎక్స్‌పర్ట్‌గా వచ్చిన క్లార్క్ మంగళవారం ఇక్కడ ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాతూ అన్నాడు.
ఆస్ట్రేలియా జట్టు ఇంతకు ముందు భారత్‌లో పర్యిటించినప్పుడు ఇప్పటివరకు భారత్‌లో పర్యటించిన జట్లన్నిటిలోకి అది బలహీనమైనదని వ్యాఖ్యానించడం ద్వారా హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. అంతేకాదు భారత జట్టు 4-0 తేడాతో ఇవజయం సాధిస్తుందని కూడా అతను జోస్యం చెప్పాడు. అయితే ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2 టెస్టుల్లో ఓడినప్పటికీ ఒక టెస్టును గెలుచుకోగలిగింది. కాగా, చాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్స్‌కు కూడా క్వాలిఫై కాలేకపోయిన విషయం దృష్ట్యా స్మిత్ నేతృత్వంలోని ప్రస్తుత జట్టే అత్యంత బలహీనమైనదని మీరు భావిస్తున్నారా? అని అడగ్గా,‘ నేను తెలివితక్కువ వాడినే కావచ్చు. అయితే రేపు వార్తాపత్రికలకు ఫ్రంట్‌పేజి న్యూస్ ఇచ్చేంత తెలివితక్కువ వాడినిమాత్రం కాదు’ అని క్లార్క్ వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా గొల్లుమని నవ్వేశారు. ఆ తర్వాత ఈ ప్రశ్నకు ఆయన సీరియస్‌గా సమాధానమిస్తూ ‘తన సామర్థ్యాన్ని నిలకడయిన పెర్ఫార్మెన్స్‌గా మార్చుకోవడానికి ఈ జట్టుకు ఇదొక అవకాశం, జట్టులో కావలసినంత టాలెంట్ ఉంది’ అని అన్నాడు.
కాగా, ప్రస్తుత భారత జట్టుకు, గతంలో సౌరబ్ గంగూలీ నేతృత్వంలోని జట్టుకు చాలా పోలికలున్నాయని క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. ‘జట్టులో కొత్త వాతావరణాన్ని సృష్టించిన క్రెడిట్ గంగూలీకే దక్కుతుంది. ధోనీ, కుంబ్లే కోహ్లీ అందరు కూడా తమదైన శైలిలో దాన్ని కొనసాగించారు. అయితే ప్రస్తుత జట్టుకు ఓటమి అంటే ఇష్టంలేని ఓ అగ్రెసివ్ కెప్టెన్ నాయకుడుగా ఉన్నాడు’ అని కోహ్లనుద్దేశించి క్లార్క్ అన్నాడు. కాగా, ఆస్ట్రేలియా జట్టులోని చాలామందికి ఐపిఎల్‌లో ఆడిన అనుభవం ఉన్న కారణంగా ఇక్కడి వాతావరణానికి తొందరగా అలవాటు పడగలరని క్లార్క్ అభిప్రాయ పడ్డాడు. ఇక్కడి పరిస్థితులు, ప్రత్యర్థి గురించి వారికి బాగా తెలుసునని, అందువల్ల రాణించకపోవడానికి ఎలాంటి సాకులూ చెప్పడానికి లేదని ఆయన అన్నాడు.
కాగా, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాదీ, టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియాతో జరగబోయే వన్‌డే సిరీస్‌కు అవ్విన్, జడేజాలకు విశ్రాంతి ఇవ్వడం అసాధారణ విషయమేమీ కాదని అభిప్రాయ పడ్డాడు. యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్‌లకు అవకాశమివ్వాలని అనుకొంటున్న విషయాన్ని సెలెక్షన్ కమిటీ వారికి తెలియజేసే ఉంటుందని తాను అనుకుంటున్నానని లక్ష్మణ్ అన్నాడు.

చిత్రం..ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న లక్ష్మణ్, క్లార్క్