క్రీడాభూమి

ప్రో కబడ్డీలో నేడు సెమీ ఫైనల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్స్ పోరాటాలు శుక్రవారం జరుగుతాయి. ఇందిరిగా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే తొలి సెమీ ఫైనల్‌లో పాట్నా పైరేట్స్, పునేరీ పల్టన్ జట్లు ఢీ కొంటాయి. రెండో సెమీ ఫైనల్ యుముంబా, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ రెండు సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ చేరుకోగా, ఓడిన జట్ల మధ్య 3, 4 స్థానాల కోసం క్లాసిఫికేషన్ మ్యాచ్ శనివారం జరుగుతుంది. అదే రోజు ఫైనల్ కూడా ఉంటుంది.

సియాల్ కోట్ జట్టుకు
ఆసిఫ్ నాయకత్వం
కరాచీ, మార్చి 3: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కారణంగా జైలు శిక్షను, సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అతనితోపాటు మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, మహమ్మద్ అమీర్ కూడా శిక్షను అనుభవించారు. వీరిలో అమీర్‌కు తిరిగి జాతీయ జట్టులో స్థానం లభించింది. ప్రస్తుతం అతను బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. అమీర్ పట్ల సెలక్టర్లు సానుకూలంగా స్పందించడంతో, అలాంటి అవకాశం కోసమే ఆసిఫ్ ఎదురు చూస్తున్నాడు. ఖయిద్ ఎ ఆజం ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో సియాల్ కోట్ జట్టుకు నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన అతను, అత్యుత్తమ ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నాడు.

వనే్డలను కబళిస్తున్న
ఏకపక్ష ఫలితాలు
లండన్, మార్చి 3: ఇటీవల కాలంలో వెల్లడవు తున్న ఏకపక్ష ఫలితాలు మొత్తం వనే్డ ఇంటర్నేషన ల్ ఫార్మెట్‌నే కబళించి వేస్తున్నదని తాజా అధ్యయ నం స్పష్టం చేసింది. యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్, నాటింహామ్ యూనివర్శిటీ బిజినెస్ స్కూల్ సం యుక్తంగా జరిపిన అధ్యయనంలో వనే్డ ఫార్మెట్‌కు పొంచివున్న ప్రమాదం వెల్లడైంది. మ్యాచ్‌లు ఏకప క్షంగా కొనసాగడం వల్ల ప్రేక్షకులు అసంతృప్తికి గు రవుతున్నారని ఈ అధ్యయనం తెలిపింది.