క్రీడాభూమి

కొరియా ఓపెన్‌లో సింధునాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 17: ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో తనను ఓడించిన నజోమీ ఒకుహరాపై భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడ జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో 22 ఏళ్ల ఈ తెలుగు తేజం 22-20, 11-20, 20-18 తేడాతో ఒకుహరాపై విజయం సాధించి, టైటిల్‌ను అందుకుంది. ఒక గంట, 23 నిమిషాలు సాగిన ఈ పోరు ఆద్యంతం అభిమానులను అలరించింది. 2016లో చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ సిరీస్‌ల్లో విజేతగా నిలిచిన సింధు మరో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చాంపియన్ హోదాలో ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఒకుహరాను హోరాహోరీ పోరాటంలో ఓడించి, వరల్డ్ కప్‌లో ఎదురైన పరాజయానికి చెంపపెట్టు సమాధానం చెప్పింది. మొదటి సెట్‌లో తీవ్రంగా పోరాడి గెలిచిన సింధుపై రెండో సెట్‌లో ఒకుహరా ఎదురుదాడికి దిగింది. ప్రపంచ చాంపియన్ స్థాయి ఆటతో విరుచుకుపడింది. దీనితో రెండో సెట్‌ను సింధు కోల్పోయింది. అయితే, కీలకమైన చివరి సెట్‌లో సింధు చాలా జాగ్రత్తగా ఆడింది. పొరపాట్లను సాధ్యమైనంత వరకూ తగ్గించుకొని, ఒకుహరాపై ఒత్తిడి పెంచింది. ఈ వ్యూహం ఫలించడంతో, చివరి సెట్‌తోపాటు టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆంథోనీ సినిసుకా గింటింగ్ గెల్చుకున్నాడు. ఫైనల్‌లో అతను జొనథాన్ క్రిస్టీని 21-13, 19-21, 22-20 పాయింట్ల తేడాతో ఓడించాడు.