క్రీడాభూమి

డిబలా హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిలన్, సెప్టెంబర్ 18: పౌలొ డిబలా హ్యాట్రిక్‌తో రాణించడంతో, చాంపియన్స్ లీగ్‌లో ససువొలోతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ని 3-1 తేడాతో గెల్చుకుంది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన డిబలా 16వ నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. నిజానికి అంతకు ముందు, పదో నిమిషంలోనే అతని ఖాతాలో తొలి గోల్ చేరి ఉండేది. కానీ, అతను కొట్టిన బంతి గోల్ పోస్టుకు తగిలి దూరంగా వెళ్లడంతో, గోల్ రాలేదు. ఆతర్వాత ఆరు నిమిషాల్లోనే తొలి గోల్ చేసిన అతను, 49, 63 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించి, హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ససువొలోకు ఏకైక గోల్‌ను మటెయో పొలిటానో అందించాడు. కాగా, ఈ విజయంతో జువెంటాస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
బెనెవెంటో చిత్తు: నపోలీ చేతిలో బెనెవెంటో చిత్తయింది. డ్రైస్ మెర్టెన్స్ మూడు గోల్స్ సాధించగా, నపోలీ 6-0 తేడాతో బెనెవెంటోపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మూడో నిమిషంలో అలాన్ ద్వారా నపోలీ ఖాతా తెరిచింది. 15వ నిమిషంలో లారెన్జో ఇన్‌సైన్ గోల్ చేయగా, మరో 12 నిమిషాల్లోనే మెర్టెన్స్ తన తొలి గోల్‌ను సాధించాడు. 32వ నిమిషంలో జొస్ కాలెజన్ చేసిన గోల్‌తో నపోలీ 4-0 ఆధిక్యానికి దూసుకెళ్లింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మెర్టెన్స్ వరుసకా 65, 97 నిమిషాల్లో గోల్స్ సాధించి, తిరుగులేని విజయాన్ని అందుకుంది. చాంపియన్స్ లీగ్ ‘ఎ’ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకునే దిశగా క్రొటోన్‌ను ఇంటిర్ మిలన్ 2-0 తేడాతో ఓడించింది.