క్రీడాభూమి

రాంకుమార్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్మాంటన్, సెప్టెంబర్ 18: కెనడాతో జరిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రివర్స్ సింగిల్స్‌లో కెనడా టెన్నిస్ సంచలనం డెనిస్ షపొవలోవ్‌ను ఢీకొన్న రాంకుమార్ రామనా థన్ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ప్రపంచ మేటి ఆటగాళ్లను సైతం మట్టికరిపిస్తూ, జెయింట్ కిల్లర్‌గా పేరు సంపాదించిన 18 ఏళ్ల షపొవలోవ్ 6-3, 7-6, 6-3 తేడాతో రాంకుమార్‌ను ఓడించి, కెనడాకు తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిన చివరి రివర్స్ సింగిల్స్‌లో యుకీ భంబ్రీకి కంటితుడుపు విజయం లభించింది. అతను బ్రేడెన్ షనర్‌పై 6-4, 4-6, 6-4 తేడాతో విజయాన్ని నమోదు చేసి, కెనడా ఆధిక్యాన్ని 2-3కు తగ్గించాడు.
ఇలావుంటే, డేవిస్ కప్‌లో భారత్ వరుసగా నాలుగో ఏడాది ప్లే ఆఫ్ అడ్డంకిని దాటడంలో విఫలమైంది. గత మూడు ప్రయత్నాల్లో సెర్బియా, చెక్ రిపబ్లిక్, స్పెయిన్ దేశాలను ఢీకొని పరాజయాలను చవిచూసింది. ఈసారి కెనడా చేతిలో ఓడడంతో, మళ్లీ ప్లే ఆఫ్ దశకు చేరుకోవడానికి వచ్చే ఏడాది ఆసియా/ ఓషియానియా గ్రూప్-1 నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. కాగా, భారత్‌ను ఓడించిన కెనడా 16 దేశాలతో కూడిన వరల్డ్ గ్రూప్‌లోకి డుగుపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రేట్ బ్రిటన్ చేతిలో ఎదురుదెబ్బతిన్నప్పటికీ, భారత్‌పై నెగ్గడం ద్వారా సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

చిత్రం..డెనిస్ షపొవలోవ్, రాంకుమార్ రామనాథన్