క్రీడాభూమి

సింధుపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 18: క్వాలిఫయర్స్‌తో మంగళవారం నుంచి ఇక్కడ మొదలుకానున్న జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో అభిమానుల దృష్టి తెలుగు తేజం పివి సింధుపై కేంద్రీకృతమైంది. ఇటీవలే కొరియా ఓపెన్ ఫైనల్‌లో నొజోమీ ఒకుహరాను ఓడించి టైటిల్ సాధించిన 22 ఏళ్ల ఈ హైదరాబాద్ జపాన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో మినాత్సు మితానీతో తలపడుతుంది. కొరియా ఓపెన్‌లో మితానీని ఓడించిన సింధు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో ఒకుహరా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందిన సింధు కొరియా ఓపెన్ ఫైనల్‌లో ఆమెను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. తనదైన రోజున ఎలాంటి స్టార్ క్రీడాకారిణినైనా చిత్తుచేసే సత్తా తనకు ఉందని నిరూపించింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ విజేత, ప్రపంచ 8వ ర్యాంక్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లో చైనాకు చెందిన ప్రపంచ 10వ ర్యాంకర్ తియాన్ హౌవెయ్‌ను ఢీ కొంటాడు. ఇప్పటి వరకూ హౌవెయ్‌తో ఏడుసార్లు తలపడిన శ్రీకాంత్ ఆరు సార్లు పరాజయాలనను ఎదుర్కొన్నాడు. ఈసారి అతనిని ఎంత వరకూ నిలువరిస్తాడో చూడాలి. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ కాలి కండరాల నొప్పి నుంచి పూర్తిగా కోలుకొని మళ్లీ బరిలోకి దిగుతున్నది. కొరియా ఓపెన్‌లో ఆమె ఆడని విషయం తెలిసిందే. అన్ సీడెడ్‌గా బరిలోకి దిగుతున్న ఆమె మొదటి రౌండ్‌లో చైనాకు చెందిన చెన్ జియావోజిన్‌ను ఎదుర్కొంటుంది. ఆ మ్యాచ్‌ని గెలిస్తే, రెండో రౌండ్‌లో ఆమెకు ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.