క్రీడాభూమి

పరస్పర అవగాహనతోనే అనుకున్నది సాధించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 18: తోటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు, తనకు మధ్య పరస్పర అవగాహన ఉందని, అందుకే, అనుకున్నది సాధించామని భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మొదటి వనే్డలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, స్పిన్నర్లు ఎప్పుడూ దూకుడుగానే ఉంటారని, వికెట్లను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తారని అన్నాడు. ఇక విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్ ఉంటే, స్పిన్నర్ల దూకుడు రెట్టింపు అవుతుందని అన్నాడు. ఆసీస్‌ను లక్ష్యం చేరకుండా కట్టడి చేయడంలో ఈ సూత్రమే కీలకంగా మారిందన్నాడు. కుల్దీప్‌తో తాను సలహాలు ఇచ్చిపుచ్చుకుంటానని చాహల్ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాడు. కోహ్లీ తమకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌల్ చేశామన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, రక్షణాత్మక విధానాన్ని అనుసరించడం కంటే, వికెట్లను సాధించేందుకు ప్రయత్నిస్తేనే ఫలితాలను రాబట్టుకోవడం సాధ్యమని అన్నాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో బౌలింగ్ చేశానని చాహల్ అన్నాడు. మాక్స్‌వెల్ బలాబలాలు తెలుసునని, ఆ అనుభవంతోనే మొదటి వనే్డలో అతనిని అవుట్ చేయగలిగానని తెలిపాడు. సరైన దిశలో బౌలింగ్ చేస్తే, బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం లేదా పెవిలియన్‌కు పంపడం సాధ్యమవుతుందని అన్నాడు. కుల్దీప్ బంతులు వికెట్ల మీదకు వస్తాయి కాబట్టి, తనను స్టంప్స్‌కు దూరంగా వేయాల్సిందిగా కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీ సూచించారని చాహల్ అన్నారు. వారి సూచనలను తాము అమలు చేశామని చెప్పాడు.