క్రీడాభూమి

క్వార్టర్స్‌కు ప్రణయ్, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 21: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగా, మహిళల సింగిల్స్‌లో సూపర్ స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు రెండో రౌండ్‌లో పరాజయాలను ఎదుర్కొని నిష్క్రమించారు. ప్రణయ్ తన రెండో రౌండ్ మ్యాచ్‌లో హూ జెన్ హవోను 21-16, 23-21 తేడాతో ఓడించాడు. సెమీస్‌లో చోటు దక్కించుకోవడానికి అతను షి యుకీని ఢీ కొంటాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో షి యుకీ 10-21, 21-17, 21-15 ఆధిక్యంతో భారత ఆటగాడు సమీర్ వర్మపై విజయం సాధించాడు. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న సమీర్ పోరాటం రెండో రౌండ్‌కే పరిమితం కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న శ్రీకాంత్ రెండో రౌండ్‌లో హు యున్‌ను 21-17, 21-11 స్కోరుతో వరుస సెట్లలో గెలుపొందాడు. తర్వాతి మ్యాచ్‌లో అతను ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌తో తలపడతాడు. విక్టర్ రెండో రౌండ్‌లో కెన్టా నిషిమొటోను 21-17, 21-18 తేడాతో ఓడించాడు.
టైటిల్ వేట కొనసాగిస్తారనుకున్న సైనా, సింధు రెండో రౌండ్‌కే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరోలినా మారిన్‌ను ఎదుర్కొన్న సైనా 16-21, 13-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మరో మ్యాచ్‌లో సింధు కూడా సరైన పోటీని ఇవ్వలేక ఇంటిదారి పట్టింది. నొజోమీ ఒకుహరా ఆమెపై 21-18, 21-8 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌లో కొంత మేరకు ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేసిన సింధు రెండో సెట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. వీరి నిష్క్రమణతో మహిళల సింగిల్స్‌లో భారత్ పోరాటానికి తెరపడింది.