క్రీడాభూమి

కుల్దీప్ హ్యాట్రిక్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 21: ఆస్ట్రేలియాతో గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వనే్డను కూడా కైవసం చేసుకున్న భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ‘చైనామన్’ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో రాణించి, భారత్‌కు 50 పరుగుల తేడాతో విజయాన్ని సాధించిపెట్టాడు. 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది.
కోహ్లీ, రహానే అర్ధ శతకాలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే అర్ధ శతకాలు సాధించి అండగా నిలిచారు. కేవలం 19 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను రోహిత్ శర్మ (7) రూపంలో కోల్పోయిన టీమిండియాను గట్టెక్కించే క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వరుస వైఫల్యాలతో అల్లాడుతున్న రహానే మళ్లీ ఫామ్‌లోకి వచ్చి, 64 బంతుల్లో 55 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అతని స్కోరులో ఏడు ఫోర్లు ఉన్నాయి. కాగా, మనీష్ పాండే మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. 13 బంతులు ఎదుర్కొన్న అతనిని అష్టన్ అగర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కేదార్ జాదవ్ పోరాటం కూడా ఎక్కువ సేపు సాగలేదు. అతను 24 బంతుల్లో 24 పరుగులు సాధించి, నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో గ్లేన్ మాక్స్‌వెల్‌కు చిక్కాడు. 186 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కొద్ది సేపటికే కోహ్లీ కూడా వెనుదిరిగాడు. జట్టు సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అతను 107 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి, నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ తన బ్యాటింగ్ ప్రతిభతో జట్టును ఆదుకున్నాడు. ఇటీవల తిరుగులేని ప్రదర్శనలతో అందరి మన్ననలు పొందుతున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌లో అభిమానులను నిరాశ పరిచాడు. 10 బంతులు ఎదుర్కొన్న అతను ఒక బౌండరీ సాయంతో ఐదు పరుగులు చేసి, స్టీవెన్ స్మిత్ క్యాచ్ అందుకోగా, కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ చెరి 20 పరుగవులు చేయగా, కుల్దీప్ యాదవ్ డకౌటయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి యుజువేంద్ర చాహల్ (1) రనౌట్‌గా వెనుదిరిగాడు. భారత్ 252 పరుగులకు ఆలౌటయ్యే సమయానికి జస్‌ప్రీత్ బుమ్రా 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్, కేన్ రిచర్డ్‌సన్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.
ఓపెనర్లు విఫలం
ఓపెనర్లు హిల్టన్ కార్ట్‌రైట్, డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలం కావడంతో, ఈ మ్యాచ్‌ని గెల్చుకొని, టీమిండియాకు సమవుజ్జీగా నిలవాలన్న ఆస్ట్రేలియా ఆశలకు గండి పడింది. వీరిద్దరూ చెరొక పరుగు చేసి పెవిలియన్ చేరారు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ స్వీకరించారు. రెండో వికెట్‌కు వీరు 76 పరుగులు జోడించారు. 39 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 39 పరుగులు చేసిన హెడ్‌ను మనీష్ పాండే క్యాచ్ పట్టగా యుజువేంద్ర చాహల్ అవుట్ చేశాడు. హార్డ్ హిట్టర్ గ్లేన్ మాక్స్‌వెల్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 18 బంతుల్లో 14 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లోనే ధోనీ స్టంప్ చేయడంతో ఔటయ్యాడు. స్టీవ్ స్మిత్ 76 బంతుల్లో, ఎనిమిది ఫోర్లతో 59 పరుగులు చేసి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రవీంద్ర జడేజాకు చిక్కాడు. ఆతర్వాత కుల్దీప్ విజృంభణ కొనసాగింది. అతను మూడు వరుస బంతుల్లో మాథ్యూ వేడ్ (2), అష్టన్ అగర్ 90), పాట్ కమిన్స్ (0) వికెట్లు పడగొట్టి, ఆసీస్‌ను దారుణంగా దెబ్బతీశాడు. మార్కస్ స్టొయినిస్ ఒంటరి పోరాటం కొనసాగించగా, నాథన్ కౌల్టర్ నైల్ (8), కేన్ రిచర్డ్‌సన్ (0) ఒకరి తర్వాత మరొకరు వెనుదిరిగారు. ఇంకా 41 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ 202 పరుగులకు ఆలౌటైంది. టాప్ స్కోరర్ స్టొయినిస్ 65 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరి మూడు వికెట్లు కూల్చగా, హార్దిక్ పాండ్య, యుజువేంద్ర చాహల్ చెరి రెండు వికెట్లు సాధించారు.
చిత్రం..హ్యాట్రిక్‌తో రాణించిన కుల్దీప్