క్రీడాభూమి

నష్టపరిహారం ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 22: ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకుండా మొండి చేయి చూపిస్తున్న భారత్ నుంచి కనీసం మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ వివాదాల పరిష్కార కమిటీ (డిఆర్‌సి)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అప్పీల్ చేసింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య 2015 నుంచి 2023 మధ్య కాలానికి ఒక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిబంధనల ప్రకారం, ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగామ్స్ జాబితాలో భారత్, పాక్ ఒప్పందం కూడా చేరింది. అయితే, ఉగ్రవాదానికి ఊతమిస్తున్నదన్న కారణంగా పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను రద్దు చేసుకుంది. ఒకవేళ పాక్ జట్టు భారత్‌కు వస్తే, భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, భారత క్రికెటర్లను పాకిస్తాన్‌లో ఆడేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. పాక్‌తో క్రికెట్ సంబంధాలపై బిసిసిఐ ఎన్ని పర్యాయాలు, ఎన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలావుంటే, లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత జింబాబ్వే మినహా పాకిస్తాన్‌లో టెస్టు హోదాగల ఒక్క జట్టు కూడా సిరీస్‌లు లేదా టోర్నీలు ఆడలేదు. ఇటీవలే ప్రపంచ ఎలెవెన్ మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను ఆడింది. పరిస్థితి కొంత వరకూ ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, భారత్‌తో జరిగే మ్యాచ్‌లకే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే, టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లపై పిసిబి పట్టుబడుతున్నది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అనుకున్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో, నష్టపరిహారాన్ని కోరుతున్నది. ఒప్పందాన్ని అమలు చేయాలని, లేకపోతే కనీసం మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని ఇప్పటికే బిసిసిఐకి లీగల్ నోటీసు పంపిన పిసిబి ఇప్పుడు డిఆర్‌సిని ఆశ్రయించండి. అభ్యర్థనలను, నోటీసులను పట్టించుకోని బిసిసిఐని పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించాలని పిసిబి తన అప్పీలులో కోరింది. అయతే, పిసిబి ఆశించిన విధంగా భారత్‌ను ఐసిసి పరి హారం ఇవ్వాల్సిందిగా ఆదేశించే అవకాశాలు కనిపించడం లేదు. ద్వైపాక్షిక సిరీస్‌లు సదరు రెండు దేశాల పరస్పర అవగాహనతో జరగాలే తప్ప, ఎవరూ బలవంగా ఒప్పిం చలేరని ఐసిసి ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసిం ది. అందులోనూ భద్రతాపరమైన అంశాల విషయంలో ఐసిసి ఏ విధమైన రిస్క్‌ను తీసుకోదు. క్రికెట్ మ్యాచ్‌ల కంటే ఆటగాళ్ల ప్రాణాలు చాలా ముఖ్యమని ఐసిసి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పైగా, ప్రపంచ క్రికెట్‌ను బిసిసిఐ పరోక్షంగా శాసిస్తున్న నేపథ్యం లో పిసిబి అనుకున్నట్టు నష్ట పరిహారం ఇప్పించడం ఐసిసి సాధ్యం కాదు.