క్రీడాభూమి

జపాన్ ఓపెన్ బాడ్మింటన్ ఎక్సెల్సెన్, మారిన్‌కు టైటిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 24: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో విక్టర్ ఎక్సెల్సెన్, మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్ విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఎక్సెల్సెన్ 21-14, 19-21, 21-14 ఆధిక్యంతో లీ చాంగ్ వెయ్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం అభిమానులను అలరించింది. మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ మారిన్ 23-21, 21-12 స్కోరుతో హీ బింజియావోపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో మార్కస్ ఫెర్నాల్డి గిడియాన్, కెవిన్ సంజయ సుకమొజో జోడీ 21-12, 21-15 స్కోరుతో తకుతో ఇనోయి, యుకీ కనేకో జోడీపై గెలుపొంది టైటిల్ అందుకుంది. మహిళల డబుల్స్ టైటిల్‌ను మిసాకా మత్సుతొమో, అయాకా తకహషి సొంతం చేసుకున్నారు. వీరు ఫైనల్‌లో కిమ్ హనా, కాంగ్ హీయాంగ్ జోడీపై 21-18, 21-16 తేడాతో విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ పైనల్‌లో తకురో హొకీ, సయాకా హిరోతా జోడీని 21-13, 21-8 తేడాతో ఓడించిన వాంగ్ ఇలూ, హువాంగ్ డింగ్‌పింగ్ జోడీకి టైటిల్ దక్కింది.