క్రీడాభూమి

ధోనీతో కోహ్లీ పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, సెప్టెంబర్ 25: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో భారత ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటీపడుతున్నట్టు కనిపిస్తున్నది. ఆదివారం జరిగిన మూడో వనే్డను గెల్చుకోవడం ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ కెప్టెన్సీలో భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. భారత కెప్టెన్‌గా అత్యధిక వరుస విజయాలను సాధించిన రికార్డును కోహ్లీ ఇప్పుడు ధోనీతో కలిసి పంచుకుంటున్నాడు. ధోనీ 2008 నవంబర్ నుంచి 2009 ఫిబ్రవరి మధ్య కాలంలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో భారత్‌ను విజయపథంలో నడిపాడు. కోహ్లీ నాయకత్వంలో విజయాల పరంపర వెస్టిండీస్‌ను కింగ్‌స్టన్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించడంతో మొదలైంది. ఆతర్వాత శ్రీలంకను ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇలావుంటే, భారత్ వరుసగా ఆరో ద్వైపాక్షిక వనే్డ సిరీస్‌ను గెల్చుకుంది. 2016లో జింబాబ్వేను ఓడించిన టీమిండియా ఆతర్వాత వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండడీస్, శ్రీలంక జట్లను చిత్తుచేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై విజయాన్ని అందుకుంది. కాగా, కోహ్లీ పూర్తికాల కెప్టెన్‌గా ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో ద్వైపాక్షిక వనే్డ సిరీస్ మొదలు పెట్టాడు. వరుసగా ఆరు సిరీస్‌లను సాధించాడు. 2007 జనవరి నుంచి 2007 ఆగస్టు వరకు రాహుల్ ద్రవిడ్, 2007 నవంబర్ నుంచి 2009 జూన్ వరకు మహేంద్ర సింగ్ ధోనీ ఆరు వరుస సిరీస్‌లతో నెలకొల్పిన రికార్డును కోహ్లీ సమం చేశాడు. మొత్తం మీద భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరు సంపాదించిన ధోనీతో తీవ్రంగా పోటీపడుతున్న కోహ్లీ అటు బ్యాట్స్‌మన్‌గానూ రాణిస్తున్నాడు. గత తొమ్మిది వనే్డల్లో అతను వరుసగా 111 (నాటౌట్), 82 (నాటౌట్), 4, 3, 131, 110 (నాటౌట్), 0, 92, 28 చొప్పున పరుగులు సాధించాడు.

చిత్రం..టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ