క్రీడాభూమి

మంబయి వర్సెస్ రెస్ట్ఫా ఇండియా ఆధిపత్యం ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇటీవలే రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న ముంబయి, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య ఆధిపత్య పోరాటం సాగనుంది. ఆదివారం నుంచి ఐదు రోజులు జరిగే ఇరానీ ట్రోఫీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ముంబయి జట్టుకు ఆదిత్య తారే, రెస్ట్ఫా ఇండియాకు నమన్ ఓఝా నాయకత్వం వహిస్తున్నారు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడానికి కొందరు, గతంలో చేజారిన అవకాశాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మరికొందరు. ఈ టోర్నీలో తీవ్రంగా పోటీపడనున్నారు. ముంబయి జట్టులో ధవళ్ కులకర్ణి, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ నాయర్ వంటి సమర్థులు ఉన్నారు. రెస్ట్ఫా ఇండియాలో స్టువర్ట్ బిన్నీ, షాబాజ్ నదీమ్, జయదేవ్ ఉనాద్కత్ తదితరులు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆసియా కప్ టి-20లో ఆడుతున్న కారణంగా పలువురు ఆటగాళ్లు రెస్ట్ఫా ఇండియాకు లేరు. అదే విధంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సేవలను ముంబయి కోల్పోయింది. ఇరు జట్లు ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో దాదాపుగా సమవుజ్జీగా ఉన్నాయి. కాబ ట్టి పోరు కూడా ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం.

ప్రో కబడ్డీ లీగ్
చాంప్ పాట్నా పైరేట్స్

న్యూఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్‌లో నిరుటి విజేత యుబుంబాను ఓడించిన పాట్నా పైరేట్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. శనివారం కడవరకూ హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 31-28 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. ప్రథమార్ధంలో ఆధిక్యాన్ని సంపాదించిన పాట్నాకు ద్వితీయార్ధంలో యుముంబా నుంచి తీవ్ర స్థాయలో ప్రతిఘటన ఎదురైంది. అయతే, ఓటమి ప్ర మాదం నుంచి తృటిలో బయటపడి, మూడు పాయంట్ల తేడాతో గెలిచింది.

పునేరీ పల్టన్‌కు మూడో స్థానం

న్యూఢిల్లీ, మార్చి 5: ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం అత్యంత ఆసక్తికరంగా సాగిన ప్రో కబడ్డీ క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను 4 పాయంట్ల తేడాతో ఓడించిన పునేరీ పల్టన్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. పునేరీ 31 పాయంట్లు సాధించగా, బెంగాల్ వారి యర్స్ 27 పరుగులు చేసింది. పునేరీ జట్టులో దీపక్ నివాస్ హుడా అత్యధికంగా 9 పాయంట్లు చేశాడు. మన్జీత్ చిల్లార్ 6, అజయ్ ఠాకూర్ 4 పాయంట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. బెంగాల్ ఆట గాళ్లలో జంగ్ కున్ లీ 9 పాయంట్లతో రాణించాడు. మహేంద్ర గణేష్ రాజ్‌పుత్ 5, బాజీరావు హొడగే 4 చొప్పున పాయంట్లు చేశారు.