క్రీడాభూమి

కౌంటీ క్రికెట్‌లో అశ్విన్ అర్ధ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వొర్సెస్టర్, సెప్టెంబర్ 26: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ క్రికెట్‌లో తొలిసారి అర్ధ శతకంతో మెరిశాడు. వొర్సిస్టర్‌షైర్-డర్హమ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న డివిజన్-2 మ్యాచ్ రెండో రోజు ఆటలో అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 130 బంతులను ఎదుర్కొని 82 పరుగులు సాధించిన అశ్విన్ వొర్సిస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి తోడు జో క్లార్క్ (65 పరుగులు), ఎడ్ బెర్నార్డ్ (75 పరుగులు) కూడా అర్ధ శతకాలతో రాణించడంతో వొర్సిస్టర్‌షైర్ జట్టు 90.2 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌటైంది. స్వదేశంలో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో కొనసాగుతున్న వనే్డ సిరీస్ నుంచి అధికారికంగా ‘విశ్రాంతి’ పొందిన అశ్విన్ గత నెల కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం అశ్విన్‌కు ఇది నాలుగో కౌంటీ మ్యాచ్. ఇంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌లలో మొత్తం 13 వికెట్లు సాధించిన అశ్విన్ గ్లూసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు కైవసం చేసుకుని సత్తా చాటుకున్నాడు.