క్రీడాభూమి

అనుచితంగా ప్రవర్తిస్తే గెంటివేయడమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 26: క్రికెట్‌లో అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లను ఇక మీదట మైదానం నుంచి గెంటివేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన కొత్త నిబంధనలు గురువారం నుంచి అమలులోకి రానుండటంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఉపయోగించే బ్యాట్ల పరిమాణం (కొలతల)పై స్పష్టమైన పరిమితులు విధించడంతో పాటు డిఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)లో మార్పులు చేస్తూ ఈ నిబంధనలను రూపొందించారు. ఈ నెల 28వ తేదీన లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే అన్ని క్రికెట్ సిరీస్‌లకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే ప్రస్తుతం ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కొనసాగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ మాత్రం పాత నిబంధనల ప్రకారమే జరుగుతుంది.