క్రీడాభూమి

మిథాలీపై బయోపిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 26: ప్రపంచ మహిళల క్రికెట్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత విశేషాలతో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించడంతో పాటు అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లలో 6000 పరుగుల మైలురాయిని అధిగమించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కిన మిథాలీ రాజ్ జీవిత విశేషాలతో సినిమా తీసేందుకు వయాకామ్-18 మోషన్ పిక్చర్స్ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో వయాకామ్-18 మోషన్ పిక్చర్స్‌తో తనకు అనుబంధం ఏర్పడినందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని, క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేలా ఎంతో మంది యువతకు, ప్రత్యేకించి బాలికలకు ఈ చిత్రం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నానని మిథాలీ రాజ్ ఒక ప్రకటనలో పేర్కొంది. మహిళల వనే్డ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టును రెండుసార్లు (2005, 2017 ఎడిషన్లలో) ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్ క్రికెట్‌కు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం అర్జున అవార్డుతో పాటు 2015లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. అలాగే బలమైన మహిళా పాత్రలతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్టగా వయాకామ్-18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఎంతో ఖ్యాతి సంపాదించింది. ‘క్వీన్’ మొదలు కొని మొన్నటి ‘కహానీ’, నిన్నటి ‘మేరీ కోమ్’ వరకూ ఈ సంస్థ రూపొందించిన ఎన్నో చిత్రాలు ఇటువంటి కోవలోనివే. భారత మహిళా క్రికెట్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చివేసి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన మిథాలీ రాజ్‌తో కలసి పనిచేసేందుకు తాము ఎంతగానో గర్వపడుతున్నామని వయాకామ్-18 మోషన్ పిక్చర్స్ సంస్థ సిఓఓ అజిత్ అంధారే తెలిపారు.

చిత్రం..భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్