క్రీడాభూమి

బిసిసిఐ పదవికి శ్రీ్ధర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంవి శ్రీ్ధర్ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) క్రికెట్ వ్యవహారాల జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశాడు. పరస్పర ప్రయోజనాలు చేకూర్చే రీతిలో అతనికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) పరిధిలో కొన్ని క్లబ్‌లు ఉన్నాయని భారత మాజీ స్పిన్నర్ అర్షద్ అయూబ్ ఆరోపణలు చేయడంతో బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ) జోక్యం చేసుకుంది. వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీ్ధర్‌ను ఆదేశించింది. అయితే, క్లబ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వని అతను రాజీనామా చేశాడని సమాచారం. కాగా, శ్రీ్ధర్ రాజీనామాను ఆమోదించినట్టు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలను వెల్లడించలేదు.