క్రీడాభూమి

సుందర్ ఆల్‌రౌండ్ ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 28: ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచడంతో, ఇండియా బ్లూను 163 పరుగుల తేడతో ఓడించిన ఇండియా రెడ్ దులీప్ ట్రోఫీ టైటిల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెడ్ 127.2 ఓవర్లలో 483 పరుగుల వద్ద ఆలౌటైంది. పృథ్వీ షా 154, కెప్టెన్ దినేష్ కార్తీక్ 111 పరుగులు చేయగా, సుందర్ 88 పరుగులు సాధించాడు. బ్లూ బౌలర్ భార్గవ్ భట్ 154 పరుగులకు 4, అక్షయ్ వఖారే 95 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బ్లూ జట్టు 67 ఓవర్లలో 299 పరుగులకే ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ (127) శతకం, జయదేవ్ ఉనాద్కత్ (83) అర్ధ శతకంతో రాణించడం మినహా ఆ జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. విజయ్ గోహిల్ 121 పరుగులక, ఐదు వికెట్లు పడగొట్టగా, సుందర్ 94 పరుగులకే ఐదు వికెట్లు కూల్చాడు. 184 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన రెడ్ రెండో ఇన్నింగ్స్‌లో 67.5 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. బాదల్ ఇంద్రజిత్ 59, సుందర్ 42 పరుగులతో రాణించారు. భార్గర్ భట్ 77 పరుగులకు 4, అక్షయ్ వఖారే 66 పరుగులకు 4 చొప్పున వికెట్లు సాధించారు. 392 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన బ్లూ జట్టు 48 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. భార్గవ్ భట్ (51), కెప్టెన్ సురేష్ రైనా (45) తప్ప మిగతా వారంతా విఫలమయ్యారు. సుందర్ 87 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, బ్లూ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. మొత్తం మీద అతని ఆల్‌రౌండ్ ప్రతిభ ఇండియా రెడ్‌ను విజేతగా నిలబెట్టింది.

చిత్రం..సుందర్