క్రీడాభూమి

కొనసాగుతున్న లుకాకు దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, సెప్టెంబర్ 28: రొమెలూ లుకాకు దూకుడును కొనసాగిస్తూ, రెండు గోల్స్ సాధించడంతో, సిఎస్‌కెఎ మాస్కో జట్టుతో జరిగిన చాంపియన్స్ లీగ్ గ్రూప్ మ్యాచ్‌లో మాంచెస్టన్ యునైటెడ్ జట్టు 4-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే తొలి గోల్ చేసిన లుకాకు 27వ నిమిషంలో మరో గోల్‌ను సంపాదించాడు. మార్షల్ 19వ నిమిషంలో, మిఖితర్యాన్ 57వ నిమిషంలో గోల్స్ నమోదు చేసి, యునైటెడ్‌ను ఆధిక్యంలో నిలిపారు. మాస్కోకు 90వ నిమిషంలో కచాయెవ్ ద్వారా కంటి తుడుపు గోల్ లభించింది. లుకాకు గత తొమ్మిది మ్యాచ్‌ల్లో పది గోల్స్ సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే, స్పోర్టింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొయెట్స్ 49వ నిమిషంలో చేసిన గోల్‌తో బార్సిలోనా 1-0 ఆధిక్యంతో గెలిచింది. మరో మ్యాచ్‌లో రోమా 2-1 తేడాతో కరాబాగ్‌ను ఓడించింది. మనోలాస్ 7, జెకో 15 నిమిషాల్లో రోమాకు గోల్స్ అందించారు. కరాబాగ్ తరఫున పెడ్రో హెన్రిక్ 26వ నిమిషంలో గోల్ చేశాడు.
రికార్డు ధరకు బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జర్మెయిన్ (పిఎస్‌జి)కి వెళ్లిన నేమార్ గోల్స్ వేటను కొనసాగిస్తున్నాడు. అల్వెస్ 3వ నిమిషంలో, కావనీ 31వ నిమిషంలో, నేమార్ 63వ నిమిషంలో గోల్స్ చేయడంతో, బయెర్న్ మ్యూనిచ్‌ను ఢీకొన్న పిఎస్‌జి 3-0 తేడాతో గెలిచింది. ఒలింపియాకొస్ పిరావెస్‌పై జువెంటాస్ 3-0 ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసింది. చాలాకాలంగా బెంచ్‌కే పరిమితం చేసిన హిగురియన్‌కు జువెంటాస్ ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకున్న అతను 60, 69 నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేశాడు. మాంజాకిక్ 80వ నిమిషంలో గోల్ సాధించాడు. ఒలింపియాకొస్ ఒక్క గోల్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. కాగా, ఒబెర్లిన్ రెండు గోల్స్ చేయగా, బెన్టికాతో తలపడిన బాసెల్ 5-0 స్కోరుతో విజయభేరి మోగించింది. ఒబెర్లిన్ 3, 69 నిమిషాల్లో గోల్స్ చేశాడు. లాంగ్ (3వ నిమిషం), వాన్ ఊల్ఫిన్‌కెల్బో (69వ నిమిషం), రివెరోస్ (76వ నిమిషం) తలా ఒక గోల్ చేశారు. ఇలావుంటే, చెల్సియా 2-1 తేడాతో అట్లెటికో మాడ్రిడ్‌ను, సెల్టిక్ 3-0 ఆధిక్యంతో ఆడెర్లెట్‌ను ఓడించాయి.

చిత్రం..రొమెలూ లుకాకు