క్రీడాభూమి

ఇది నిజమేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం తనకు లభించడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని అమర్‌జిత్ సింగ్ కియామ్ అన్నాడు. ఎఎఫ్‌సి అండర్-16 చాంపియన్స్‌లో జితేంద్ర సింగ్, బ్రిక్స్ కప్ టోర్నీలో సురేష్ సింగ్ వాంగ్‌జమ్ భారత్‌కు కెప్టెన్సీ వహించారు. అయితే, ఆ ఇద్దరినీ కాదని, అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో ఆడే జట్టుకు సెలక్టర్లు అమర్‌జిత్ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ విషయమై అతను పిటిఐతో మాట్లాడుతూ తనను కెప్టెన్‌గా నియమించారన్న సమాచారాన్ని హెడ్ కోచ్ లూయిస్ నార్టన్ డి మటోస్ తొలుత చెప్పాడని అన్నాడు. ఆ వార్త విన్న వెంటనే తాను ఆశ్చర్యానికి గురయ్యానని మణిపూర్‌లోని తౌబల్ జిల్లాకు చెందిన అమర్‌జిత్ సింగ్ తెలిపాడు. అతని తండ్రి వ్యవసాయ కూలీకాగా, తల్లి చేపలు అమ్ముతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేగానీ కుటుంబం నడవదు. అయితే, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, అమర్‌జిత్ సింగ్‌కు ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి వారు అతనిని ప్రోత్సహించారు. అతి కష్టం మీద డబ్బు పోగుచేసి అతనిని మ్యాచ్‌లకు, టోర్నీలకు పంపేవారు. తన కుటుంబ పరిస్థితులను అమర్‌జిత్ సింగ్ వివరిస్తూ, ఎంతో కష్టపడి ఫుట్‌బాల్‌లో రాణించడానికి కృషి చేస్తున్నానని చెప్పాడు. అండర్-17 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు స్ఫూర్తి దాయక నాయకత్వాన్ని అందించడానికి సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపాడు.