క్రీడాభూమి

పాక్ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, అక్టోబర్ 1: సెలక్టర్లు తనను ఎంపిక చేయకుండా తరచు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదనతో పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. లాహోర్ సిటీ క్రికెట్ సంఘం (ఎల్‌సిసిఎ) మైదానంలో ఒక మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అతను ఈ అఘాయిత్యానికి ప్రయత్నించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే, ఖైద్ ఎ ఆజమ్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గులాం హైదర్ అబ్బాస్ అనే కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మైదానంలోకి దూసుకొచ్చాడు. తనతో తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకొని, నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, మ్యాచ్ చూస్తున్న కొంత మంది ప్రేక్షకులు వెంటనే స్పందించి అతనిని అడ్డుకున్నారు. ఎల్‌సిసిఎ అధికారులు, భద్రతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని అబ్బాస్‌కు నచ్చచెప్పారు. లాహోర్ సిటీ ఈస్ట్ జోన్‌కు చెందిన తనను సెలక్టర్లు ఎంపిక చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎప్పటికప్పుడు వాగ్దానాలిస్తూ వాటిని నీరుగారుస్తున్నారని అబ్బాస్ వాపోయాడు. తనకు ప్రతిభ ఉన్నప్పటికీ పేద కుటుంబం నుంచి వచ్చినందుకే వారు పట్టించుకోవడం లేది ఆరోపించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వెంటనే స్పందించాలని కోరాడు. ఒకవేళ తన పట్ల ఇదే రకమైన వివక్ష కొనసాగితే, గడాఫీ స్టేడియం ప్రధాన ద్వారం ఎదురుగా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ సంఘటనపై పిసిబి ఇంకా స్పందించలేదు.