క్రీడాభూమి

బావ్నే అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 1: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 360 పరుగులు సాధించిన భారత్ ‘ఎ’ జట్టు 149 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. అంకిత్ బావ్నే అజేయ శతకంతో కదంతొక్కగా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్ అర్ధ శతకం పూర్తిచేసి క్రీజ్‌లో ఉన్నాడు. ఓపెనర్ రవి కుమార్ సామ్రాట్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, ప్రియాంక్ పాంచల్ 46, శ్రేయాస్ అయ్యర్ 82, కెప్టెన్ కరుణ్ నాయర్ 43 చొప్పున పరుగులు సాధించారు. 206 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూలగా, బావ్నే, పార్థీవ్ పటేల్ ఐదో వికెట్‌కు 154 పరుగులు జోడించారు. 166 బంతులు ఎదుర్కొని 116 పరుగులు చేసిన బావ్నే స్కోరులో 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. పార్థీవ్ పటేల్ 78 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. మ్యచ్ మూడో రోజు, సోమవారం భారత్ ‘ఎ’ ఆధిక్యాన్ని మరింతగా పెంచేందుకు వీరు కృషి చేయడం ఖాయం.
ఇలావుంటే, న్యూజిలాండ్ ‘ఎ’ మొదటి ఇన్నింగ్స్‌లో 69.5 ఓవర్లలో 211 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ జీత్ రావల్ (48), మిడిల్ ఆర్డర్‌లో కొలిన్ మున్రో (65, టిమ్ సీఫెర్ట్ (44 నాటౌట్) తప్ప మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కర్న్ శర్మ చెరి మూడు వికెట్లు పడగొట్టగా, షాబాద్ నదీం రెండు వికెట్లు సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 69.5 ఓవర్లలో ఆలౌట్ 211 (జీత్ రావల్ 48, కొలిన్ మున్రో 65, టిమ్ సీఫెర్ట్ 44 నాటౌట్, షార్దూల్ ఠాకూర్ 3/34, కర్న్ శర్మ 3/49, షాబాద్ నదీం 2/41).
భారత్ ‘ఎ’ మొదటి ఇన్నింగ్స్ (రెండో రోజు ఆట ముగిసే సమయానికి): 82 ఓవర్లలో 4 వికెట్లకు 360 (ప్రియాంక్ పాంచాల్ 46, శ్రేయాస్ అయ్యర్ 82, కరుణ్ నాయర్ 43, అంకిత్ బావ్నే 116 నాటౌట్, పార్థీవ్ పటేల్ 56 నాటౌట్, ఇష్ సోధీ 2/107).