క్రీడాభూమి

అక్షర్ పటేల్ సూపర్ స్పెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: ఒక దశలో ఆస్ట్రేలియా జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి వంద పరుగులకు చేరుకుంది. అదే స్కోరువద్ద రెండో వికెట్‌ను చేజార్చుకోగా, 18 పరుగుల తేడాతో మరో రెండు వికెట్లను సమర్పించుకుంది. లేకపోతే, ఆ జట్టుకు భారీ స్కోరు సాధ్యమయ్యేది. భారత బౌలర్లు, ప్రత్యేకించి అక్షర్ పటేల్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన అతను 38 పరుగులకు 3 వికెట్లు కూల్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ కూడా మెరుగుపడింది. హార్దిక్ పాండ్య, వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కాంబినేషన్‌లో జేమ్స్ ఫాల్క్‌నెల్ రనౌట్ కావడమే మెరుగు పడిన టీమిండియా ఫీల్డింగ్‌కు అద్దం పడుతుంది.
* టీమిండియా పార్ట్‌టైమ్ బౌలర్ కేదార్ జాధవ్ తన కెరీర్‌లో మొదటిసారి ఒక వనే్డలో పూర్తి కోటా 10 ఓవర్లు బౌల్ చేశాడు. ఇంతకు ముందు అతను అత్యధికంగా ఎనిమిది ఓవర్లు వేశాడు. మొత్తం మీద వనే్డల్లో అతను వేసిన ఓవర్ల సగటు మ్యాచ్‌కి నాలుగు ఓవర్లు.
* నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ సంఘం (విసిఎ) మైదానంలో ఇంతకు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు ఢీకొన్నప్పుడు ఏకంగా 701 పరుగులు నమోదయ్యాయి. ఆసీస్ జట్టు 350 పరుగులు సాధించగా, టీమిండియా 351 పరుగులు చేసి, విజయభేరి మోగించింది. ఈసారి ఆసీస్ ఆ స్థాయిలో స్కోరును చేయలేకపోయింది.
* ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ మొత్తం 10 వికెట్లు పడగొట్టి, ఉత్తమ బౌలర్ల జాబితాలో అందరి కంటే ముందున్నాడు. కేర్ రిచర్డ్‌సన్, కుల్దీప్ యాదవ్ చెరి ఏడు వికెట్లతో సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకుంటున్నారు. యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్య చెరి ఆరు వికెట్లు సాధించి, మూడో స్థానంలో ఉన్నారు.