క్రీడాభూమి

అలవోకగా టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, అక్టోబర్ 1: విదర్భ క్రికెట్ సంఘం (విసిఎ) మైదానంలో ఆదివారం జరిగిన చివరి వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది. సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అక్షర్ పటేల్ పకడ్బందిగా బంతులు వేసి, మూడు వికెట్లను పడగొట్టడంతో ఆసీస్‌ను భారత్ తొమ్మిది వికెట్లకు 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కడంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియాకు విజయం సులభసాధ్యమైంది. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా హార్దిక్ పాండ్య ఎంపికయ్యాడు.
టాస్ గెలిచిన స్మిత్
ఇండోర్ వనే్డ మాదిరిగానే ఈసారి కూడా టాస్ గెలిచిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ అదే స్థాయి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. మొదటి వికెట్‌కు 66 పరుగులు జత కలిసిన తర్వాత, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు సులభమైన క్యాచ్ ఇచ్చి ఆరోన్ ఫించ్ వెనుదిరిగాడు. అతను మొత్తం 36 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులు సాధించాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వైఫల్యాల బాటలోనే కొనసాగుతూ, 25 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేశాడు. కేదార్ జాధవ్ బౌలింగ్‌లో అతను ఎల్‌బిగా వెనుదిరిగడంతో 100 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కూలింది. తర్వాత కొద్ది సేపటికే వార్నర్ పెవిలియన్ చేరాడు. 62 బంతుల్లో, ఐదు ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసిన అతనిని మనీష్ పాండే క్యాచ్ పట్టగా అక్షర్ పటేల్ వెనక్కు పంపాడు. అప్పటికి స్కోరు 112 పరుగులుకాగా, మరో ఆరు పరుగుల తర్వాత పీటర్ హ్యాండ్స్‌కోమ్ కూడా అవుటయ్యాడు. 13 పరుగులు చేసిన అతను అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అజింక్య రహానేకు దొరికిపోయాడు. ఈ దశలో వికెట్ల పతనాన్ని అడ్డుకునే బాధ్యతను ట్రావిస్ హెడ్, మార్కస్ స్టొయినిస్ స్వీకరించారు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. 59 బంతుల్లో 42 పరుగులు (59 బంతులు/ నాలుగు ఫోర్లు) చేసిన ట్రావిస్ హెడ్‌ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో, 205 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటైన స్టొయినిస్ 63 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. జేమ్స్ ఫాల్క్‌నెర్ 12 పరుగులు చేసి, ఇన్నింగ్స్ ముగియడానికి మరో బంతి మిగిలి ఉండగా రనౌటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి బంతికి నాథన్ కౌల్టర్ నైల్ బౌల్డ్ అయ్యాడు. మొత్తం మీద 50 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లకు 242 పరుగులు చేయగలిగింది. పాట్ కమిన్స్ అప్పటికి రెండు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అక్షర్ పటేల్ 38 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, జస్‌ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు లభించాయి.
తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం
ఆస్ట్రేలియాను ఓడించి, నాలుగో వనే్డలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు అజింక్య రహానే, రోహిత్ శర్మ చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 124 పరుగులు జత చేసిన తర్వాత నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగిన రహానే 74 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లతో 61 పరుగులు సాధించాడు. రెండో వికెట్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి 99 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ వికెట్ కూలింది. 109 బంతులు ఎదుర్కొన్న అతను 125 పరుగులు సాధించాడు. అందులో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఆడం జంపా బౌలింగ్‌లో నాథన్ కౌల్టర్ నైల్ క్యాచ్ అందుకోగా రోహిత్ పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో కోహ్లీ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. 55 బంతుల్లో, రెండు ఫోర్లతో 39 పరుగులు చేసిన కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ని మార్కస్ స్టొయినిస్ పట్టుకున్నాడు. చివరిలో కేదార్ జాధవ్ (5 నాటౌట్), మనీష్ పాండే (11 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జట్టును లక్ష్యానికి చేర్చారు. ఇంకా 43 బంతులు మిగిలి ఉండగానే, భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, సిరీస్‌ను 4-1గా ముగించింది.

చిత్రం..ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ హార్దిక్ పాండ్య