క్రీడాభూమి

టైటాన్స్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 3: ప్రో కబడ్డీ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్థానిక జట్టు తమిళ్ తలైవాస్‌పై తెలుగు టైటాన్స్ 21 పాయింట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. సూపర్ స్టార్ రాహుల్ చౌదరి 16 పాయింట్లతో రాణించగా, మొసెన్ మగ్‌సొద్లూ 12, నీలేష్ సాలుంకే 11 చొప్పున పాయింట్లు సంపాదించారు. వీరి విజృంభణకు టైటాన్స్‌కు 58 పాయింట్లు సాధమయ్యాయి. తలైవాస్ తరపున అజయ్ ఠాకూర్ ఒక్కడే ఒంటరి పోరాటం జరిపి 20 పాయింట్లు చేశాడు. కానీ, అతనికి సహచరుల నుంచి సరైన మద్దతు లభించలేదు. అంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో తలైవాస్ 37 పాయింట్లకే పరిమితమైంది.
ఢిల్లీ చిత్తు
గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్ చేతిలో దబాంగ్ ఢిల్లీ చిత్తయింది. గుజరాత్ 42 పాయింట్లు సాధిస్తే, ఢిల్లీ 22 పాయింట్లతో సరిపుచ్చుకుంది. గజరాత్ తరపున సచిన్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చంద్రన్ రంజిత్ 9, రాకేష్ నర్వాల్, సునిల్ కుమార్ చెరి ఆరు పాయింట్లు సాధించారు. ఢిల్లీ ఆటగాళ్లలో అబొల్‌ఫజల్ మగ్‌సొద్లూ 7, శ్రీరాం 6 చొప్పున పాయింట్లు చేశారు.