క్రీడాభూమి

మహిళల మ్యాచ్‌లనూ ప్రసారం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ మన దేశంలో అభివృద్ధి చెందాలంటే ముందుగా వారు ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉంటుందని భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయ
పడింది. సానియా మీర్జా (టెన్నిస్), సైనా నెహ్వాల్ (బాడ్మింటన్) పాల్గొంటున్న మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం సంతోషకరమని, అదే విధంగా మహిళా క్రికెటర్లు ఆడే మ్యాచ్‌లను కూడా ప్రసారం చేస్తే, ఈ విభాగానికి తగిన గుర్తింపు లభిస్తుందని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ పేర్కొంది. మ్యాచ్‌లు ప్రసారమైతేనే కార్పొరేట్ స్పాన్సర్లు లభిస్తారని తెలిపింది. ఆస్ట్రేలియా టూర్‌లో చారిత్రక విజయాన్ని సాధించినప్పటికీ తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీలంకతో సిరీస్ జరిగినప్పుడు కూడా ప్రత్యక్ష ప్రసారాలు లేకపోవడం దురదృష్టకరమని చెప్పింది. ఈసారి మహిళల టి-20 వరల్డ్ కప్ మన దేశంలో జరుగుతున్నందువల్ల, మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై అద్భుతంగా రాణించామని, అందుకే తమపై అభిమానుల అంచనాలు విపరీతంగా పెరిగాయని తెలిపింది. మ్యచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసివుంటే తామంతా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పోటీ పడేందుకు వీలు ఉంటుందని తెలిపింది. గుర్తింపు, ఆదరణ లేకపోతే ఎవరైనా నిరాశ చెందుతారని అన్నది. మరో ప్రశ్నకు స్పందిస్తూ టి-20 వరల్డ్ కప్‌ను పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది.

శృతి మించిన అభిమానం!

మీర్పూర్, మార్చి 6: బంగ్లాదేశ్ అభిమానులు శృతి మించిపోయారు. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ చేతిలో ఉన్నట్టు చూపే ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశమైంది. ధోనీ తలను తెగనరికి, దానితో తస్కిన్ బౌలింగ్‌కు సిద్ధమైనట్టు కనిపించే విధంగా ఉన్న ఆ ఫొటోతోపాటు, భారత కీలక ఆటగాళ్లు అర గుండు చేయించుకొని వరుసగా నిల్చున్నట్టు మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ రెండు ఫొటోలు బంగ్లాదేశ్ అభిమానుల అతి ధోరణిని స్పష్టం చేస్తున్నది.