క్రీడాభూమి

సమర్థుడు కాబట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సమర్థుడు కాబట్టే ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాలో వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు అవకాశం కల్పించారా? ఫిట్నెస్ సమస్యలు తప్ప ఫామ్ కోల్పోవడం అనే సమస్య అతనికి ఎప్పుడూ ఎదురుకాలేదా? యువ ఫాస్ట్ బౌలర్లతో పోటీపడే సత్తా అతనికి ఉందా? నెహ్రా 38 సంవత్సరాలను పూర్తి చేసుకొని బుధవారం నాటికి 158 రోజులు పూర్తవుతుంది. యువ పేసర్లను విడిచిపెట్టి, ఇంత పెద్ద వయసున్న నెహ్రాను ఎంపిక చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే, నెహ్రా ప్రతిభావంతుడని, అందుకే అతనిని జట్టులోకి తీసుకున్నామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారి ఒకరు పిటిఐతో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. నెహ్రా ఫిట్నెస్ సమస్యలతో సిరీస్‌లు లేదా టోర్నీలకు దూరమయ్యాడే తప్ప ఫామ్ లేకపోవడం వల్ల కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అతను అన్నాడు. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని, ప్రతిభతో దానికి ముడిపెట్టడానికి వీల్లేదని నెహ్రా పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఫిట్నెస్‌తో ఉంటేనే నెహ్రాకు తుది జట్టులో ఆడే అవకాశం దక్కవచ్చని చెప్పాడు. టి-20 జట్టులో అతనికి చోటు కల్పించడంలో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న నెహ్రా ఇప్పటి వరకూ కెరీర్‌లో 17 టెస్టులు ఆడి, 77 పరుగులు చేశాడు. 19 పరుగులు అతని అత్యధిక స్కోరు. 3,447 బంతులు వేసి, 1,866 పరుగులిచ్చిన అతను 44 వికెట్లు కూల్చాడు. 72 పరుగులకు నాలుగు వికెట్లు టెస్టుల్లో అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. 120 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను 141 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 24 పరుగులు. 5,751 బంతులు వేసి, 4,981 పరుగులిచ్చిన అతని ఖాతాలో 157 వికెట్లు ఉన్నాయి. 23 పరుగులకు ఆరు వికెట్లు అతని బెస్ట్ బౌలింగ్. టి-20 ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌కు వస్తే, నెహ్రా 26 మ్యాచ్‌లు ఆడాడు. 28 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 22 పరుగులు. 564 బంతులు వేసి, 729 పరుగులు సమర్పించుకున్న అతను 34 వికెట్లు సాధించాడు. అత్యుత్తమంగా 19 బంతులకు మూడు వికెట్లు కూల్చాడు.

వారసత్వ సంపదగా
వౌలిక సదుపాయాలు
అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ డైరెక్టర్ సెప్పీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: అండర్-17 సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధం చేసిన వౌలిక సదుపాయాలన్నీ రానున్న కాలంలో వారసత్వ సంపదగా మారిపోతాయని లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ (ఎల్‌ఒసి)కి చెందిన టోర్నమెంట్ డైరెక్టర్ జేవియర్ సెప్పీ అన్నాడు. మంగళవారం అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మెగా టోర్నీ కోసం కనీవినీ ఎరుగని రీతిలో పలు నిర్మాణాలను, ఆధునీకరణ పనులను చేపట్టి, పూర్తి చేసినట్టు తెలిపాడు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తుందని జోస్యం చెప్పాడు. దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి అండర్-17 వరల్డ్ కప్ పునాది అవుతుందన్నాడు. భావి తరాలకు వివిధ నిర్మాణాల ప్రమాణాలు, ఆటగాళ్ల పోరాటతత్వం వారసత్వ సంపదగా అందుతుందని సెప్పీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఖేలో
ఇండియా!
న్యూఢిల్లీ: ఖేలో ఇండియా నినాదంతో జాతీయ స్థాయిలో అండర్ పాఠశాలలు, కళాశాలల క్రీడా పోటీలను డిసెంబర్, జనవరి మాసాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర క్రీడల సహాయ మంత్రి (స్వతంత్ర), 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన షూటర్ రాజ్యవర్ధర్ సింగ్ రాథోడ్ ప్రకటించారు. ఈ పోటీల ద్వారా ఏటా 1,000 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి అత్యుత్తమ శిక్షణను ఇప్పిస్తామని అన్నారు. ఐదేళ్ల కాలంలో వారికి ఎనిమిది లక్షల రూపాయలను చెల్లిస్తామని తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రతిభాపాటవాలను గుర్తించి, వెలికితీయకపోతే, భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించే క్రీడాకారులను అందించలేమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రీడలకు కేంద్రం సహాయసహకారాలను అందిస్తున్నదని తెలిపారు. క్రీడా రంగంలో అద్భుతాలు వాటంతట అవే జరగవని, కింది స్థాయిలో జల్లెడపట్టి, సమర్థులను వెలికితీసి, వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇప్పించినప్పుడు మాత్రమే అద్భుతాలు సాధ్యమవుతాయని వ్యాఖ్యానించారు. క్రీడల్లో దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.