క్రీడాభూమి

భారత అండర్-17 ఫుట్‌బాల్ జట్టుకు రాథోడ్ పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మైదానంలోకి దిగిన తర్వాత దూకుడుగా ఆడాలని, ప్రతి మ్యాచ్‌నీ అదే చివరి పోరాటంగా భావించాలని భారత అండర్-17 ఫుట్‌బాల్ జట్టుకు కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పిలుపునిచ్చారు. జట్టులోని 21 మంది సభ్యులను ఆయన మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సన్మానించారు. కెప్టెన్ అమర్‌జిత్ సింగ్ కియామ్‌కు ఒక జ్ఞాపికనిచ్చి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అండర్-17 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న కారణంగా భారత జట్టు మెయిన్‌డ్రాకు అర్హత సంపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ఎవరి ప్రమేయం లేకుండా మెయిన్ డ్రాకు వచ్చినట్టు కాకుండా, టోర్నమెంట్‌లో తమదైన ముద్ర వేయడానికి జట్టులోని ప్రతి ఆటగాడు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. పోటీ ప్రారంభమైన మరుక్షణం నుంచి చివరి వరకూ చావో రేవో అన్న చందంగా పోరాటం సాగించాలని అన్నారు. ‘మీ పోరాటం యువతకు మార్గదర్శకం కావాలి. మీ పోటీతత్వం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోవాలి. మీ జీవితంలో అదే చివరి పోటీ అన్న రీతిలో ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటాన్ని ఆపకూడదు. ఒక్కో మ్యాచ్‌ని గెలుస్తూ, ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడే ప్రతి జట్టునూ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలి’ అన్నారు. ప్రతి మ్యాచ్‌నీ ఒక యుద్ధంగా తీసుకోకపోతే, ముందంజ వేయడం కష్టమని అన్నారు. దేశం మొత్తం అండగా నిలుస్తుందని, ఆ ఉత్సాహం, ప్రోత్సాహంతో అద్భుతాలు సృష్టించాలని కోరారు. ‘మీరు గోవాకు లేదా బెంగాల్‌కు.. మణిపూర్‌కు లేదా అస్సాంకు ప్రాతినిథ్యం వహించడం లేదు. మీరంతా భారత్ తరఫున ఆడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇనే్నళ్ల మీ కష్టానికి, పడిన తపనకు, చేసిన త్యాగాలకు పరీక్షా సమయం ఆసన్నమైంది. ఎన్నో అడ్డంకులను, కష్టనష్టాలను ఎదుర్కొని మీరు అండర్-17 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని సంపాదించుకున్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి మరోసారి పోరాటాలు చేయండి’ అని భారత ఆటగాళ్లకు రాథోడ్ పిలుపునిచ్చారు.

మోర్న్ మోర్కెల్‌కు
మూడు వారాల విశ్రాంతి!

పోచెఫ్‌స్ట్రూమ్, అక్టోబర్ 3: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్న్ మోర్కెల్‌కు కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో 5.1 ఓవర్లు బౌల్ చేసిన తర్వాత అతను పొత్తికడుపు నొప్పి కారణంగా మైదానాన్ని విడిచిపెట్టాడు. అప్పటికే కూలిన బంగ్లాదేశ్ మూడు వికెట్లలో మోర్కెల్ రెండింటిని సాధించడం విశేషం. కాగా, వైద్య పరీక్షల నిమిత్తం అధికారులు అతనిని వెంటనే ఆసుపత్రికి పంపారు. అతని పొత్తికడుపులో కండరాలు చిట్లినట్టు పరీక్షల్లో తేలిందని, దీనితో అతనికి మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమవుతుందని వైద్యులు ప్రకటించారు. దక్షిణాఫ్రికా పేసర్లలో డేల్ స్టెయిన్, వెర్నన్ ఫిలాండర్, క్రిస్ మోరిస్ ఇప్పటికే గాయాల కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యారు. వారు మళ్లీ ఎప్పుడు పూర్తి ఫిట్నెస్‌తో జట్టులోకి అడుగుపెడతారోవ తెలియని పరిస్థితి. ఆ జాబితాలో ఇప్పుడు మోర్కెల్ కూడా చేరాడు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం నుంచి బ్లూంఫొంటెన్‌లో రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉండడు. కాగా, మోర్కెల్ స్థానంలో డేన్ పటెర్సన్‌ను జట్టులోకి తీసుకున్నట్టు క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సిఎస్‌ఎ) ప్రకటించింది.

కోచ్‌పై డబ్లుఎఫ్‌ఐ వేటు
ఇండోర్, అక్టోబర్ 3: కోచ్ కృపా శంకర్ పటేల్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) సస్పెన్షన్ వేటు వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని వివరించింది. డబ్ల్యుఎఫ్‌ఐ సరైన విధానాలను అనుసరించడం లేదని, జాతీయ, అంతర్జాతీయ నిబంధనలను కలిపేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఈనెల 12న సోషల్ మీడియాలో కృపా శంకర్ పోస్ట్ చేశాడు. అంతేగాక, ప్రస్తుతం అనుసరిస్తున్న రెజ్లింగ్ నిబంధనలను గుర్రానికి, గాడిదకు పుట్టిన వర్ణ సంకర జాతిగా అభివర్ణించాడు. కాగా, ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. దీనితో డబ్ల్యుఎఫ్‌ఐ జోక్యం చేసుకుంది. క్రమశిక్షణ కమిటీ కూడా కృపా శంకర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా సిఫార్సు చేసే అవకాశాలున్నాయి.