క్రీడాభూమి

భారత్‌కు నాలుగో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 3: మహిళల వనే్డ క్రికెట్‌లో భారత్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వనే్డ ర్యాంకింగ్స్ టీం విభాగంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఈ రెండు జట్లు సమానంగా 128 రేటింగ్ పాయింట్లను సంపాదించాయి. అయితే, ఇంగ్లాండ్ 34 మ్యాచ్‌లు ఆడగా, ఆస్ట్రేలియా 40 మ్యాచ్‌లు ఆడింది. ఫలితంగా ఇంగ్లాండ్‌కు నంబర్ వన్ స్థానం దక్కింది. న్యూజిలాండ్ 118 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించుకోగా, 116 పాయింట్లు సంపాదించిన భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. వనే్డ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ రెండో స్థానంలో ఉంది. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) 763 పాయింట్లతో నంబర్ వన్‌గా నిలవగా, మిథాలీ 753 పాయింట్లతో రెండో స్తానంలో ఉంది. ఆస్ట్రేలియాకే చెందిన ఎలిస్ పెర్రీ 720 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని మూడో స్థానంలో నిలిచింది. కాగా, హర్బన్ ప్రీత్ కౌర్ 677 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
వనే్డ బౌలింగ్ విభాగానికి వస్తే, ఝూలన్ గోస్వామికి రెండో స్థానం లభించింది. మార్ట్‌జనే కాప్ (దక్షిణాఫ్రికా) 652 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఝూలన్ 650 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. జెస్ జొహాసెన్ (ఆస్ట్రేలియా) 625 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఏక్తా బిస్త్ (553 పాయింట్లు)కు 11, శిఖా పాండే (550 పాయింట్లు)కు 12, రాజేశ్వరీ గైక్వాడ్ (517 పాయింట్లు)కు 15 స్థానాలను దక్కాయి. ఆల్‌రౌండర్స్ విభాగంలో భారత్‌కు సంబంధించినంత వరకు దీప్తి శర్మ 7, ఝూలన్ గోస్వామి 10, శిఖా పాండే 16, హర్మన్‌ప్రీత్ గౌర్ 18 స్థానాల్లో నిలిచి, ‘టాప్-20’ జాబితాలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా) 452 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, స్ట్ఫోనే టేలర్ (వెస్టిండీస్), డేన్ వాన్ నికెర్క్ (దక్షిణాఫ్రికా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఆమె నా సోదరి!
*మిస్టరీకి తెరదించిన హార్దిక్ పాండ్య
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక ఫొటోకు సంబంధించి నెలకొన్న గందరగోళానికి, అనుమానాలకు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తెరదించాడు. ఆ పొటోలో తనతో ఉన్నది తన సోదరి అని ప్రకటించాడు. హార్దిక్ పాండ్య, ఒక యువతితో తీసుకున్న సెల్ఫీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అతనితో ఉన్న మహిళ ఎవరన్న ప్రశ్నకు ఎవరికి తోచిన సమాధానాలు వారిచ్చారు. రానురాను ఊహాగానాలు పెరగడంతో, హార్దిక్ పాండ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఫొటోలో ఉన్నది తన సోదరి అని అతను ట్వీట్ చేసి, అందరి అనుమానాలను నివృత్తి చేశాడు.