క్రీడాభూమి

భారత జట్టుకు ధోనీనే అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే గొప్ప ఆస్తి అని, అందుకే, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా అనేక విజయాలను సాధించగలుగుతున్నాడని మాజీ కెప్టెన్ నయన్ మోంగియా వ్యాఖ్యానించాడు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, 2014 డిసెంబర్ 30న ధోనీ హఠాత్తుగా టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగాడు. దీనితో టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లీ చేతికి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో వనే్డ, టి-20 ఇంటర్నేషనల్స్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు ధోనీ ప్రకటించిన వెంటనే, ఆ ఫార్మాట్స్‌లోనూ పగ్గాలు కోహ్లీకి దక్కాయి. అప్పటి నుంచి టీమిండియాకు మూడు విభాగాల్లోనూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ ధోనీ సలహాలు, సూచనలు తీసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న క్రికెటర్‌గా, టీమిండియాకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప క్రికెటర్‌గా, సంక్లిష్టమైన పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకునే వ్యూహకర్తగా మంచి పేరు తెచ్చుకున్న ‘మిస్టర్ కూల్’ ధోనీ సూచనలే కోహ్లీ ఉత్తమ కెప్టెన్‌గా ఎదిగేందుకు తోడ్పడుతున్నాయని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోంగియా అన్నాడు. పరిస్థితులు తన చేయి జారిపోతున్నాయన్న అనుమానం కలిగిన వెంటనే ధోనీని సంప్రదించడం, అతని సలహాలను తీసుకోవడం కోహ్లీకి అలవాటని చెప్పాడు. అదే విధంగా బౌలింగ్, ఫీల్డింగ్‌పై సమయోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీని మించిన వారు లేరని మోంగియా ప్రశంసించాడు. అందుకే, కోహ్లీ అతని నుంచి సలహాలు తీసుకొని, ముందుకు వెళుతున్నాడని చెప్పాడు. ఒక రకంగా సమర్థుడైన కెప్టెన్‌గా కోహ్లీ ఎదిగేందుకు ధోనీ పరోక్షంగా దోహదపడుతున్నాడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత, మాజీ కెప్టెన్లు కోహ్లీ, ధోనీ కలసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం టీమిండియాకు లాభిస్తున్న అంశాలని పేర్కొన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, 2019 వరల్డ్ కప్ వరకూ జట్టులో ధోనీ కొనసాగే అవకాశాలు లేకపోలేదని అన్నాడు. అత్యుత్తమ ఫిట్నెస్‌ను కొనసాగిస్తున్న టీమిండియా క్రికెటర్లలో ధోనీ ముందు వరుసలో ఉంటాడని మోంగియా చెప్పాడు. ఫిటెస్‌ను, ఫామ్‌ను కొనసాగించిన వారంతా జట్టులో ఉంటారని కోచ్ రవి శాస్ర్తీ పలు ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలను అతను ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ రెండు లక్షణాలు ధోనీలో పుష్కలంగా ఉన్నాయని, అందుకే, అతను కనీసం రెండే మూడేళ్లు జట్టులో కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నదని చెప్పాడు. ధోనీ సలహాలు, సూచనలతో కెప్టెన్సీకి మెరుగులు దిద్దుకుంటున్న కోహ్లీ ప్రపంచ మేటి నాయకుడిగా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు.