క్రీడాభూమి

కేన్‌పైనే భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 4: మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ ట్రయికర్ హారీ కేన్‌పైనే భారం వేసి, ప్రపంచ కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌కు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమైంది. ఇటీవల కాలంలో ఆడిన ఎనిమిది క్లబ్, కౌంటీ మ్యాచ్‌ల్లో 13 గోల్స్ సాధించి కేన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వెంబర్లీలో శుక్రవారం స్లొవేనియాతో జరిగే మ్యాచ్‌లోనూ అతను రాణిస్తాడని, జట్టుకు గొప్ప ఆరంభాన్నిస్తాడని అంతా ఆశిస్తున్నారు. కాగా, అదే రోజు జరిగే ఇతర కీలక మ్యాచ్‌ల్లో బొలివియాను బ్రెజిల్, వెనెజులాను ఉరుగ్వే, కొలంబియాను పరాగ్వే, నార్తన్ ఐర్లాండ్‌ను ఉజర్మనీ, స్లొవేకియాను స్కాట్‌లాండ్, అర్మేనియాతో పోలాండ్ జట్లు ఢీ కొంటాయి. అత్యంత పటిష్టమైన జట్లలో ఒకటైన అర్జెంటీనా ఈసారి మొదటి క్వాలిఫయర్‌లో మరో బలమైన జట్టు పెరూతో తలపడుతుంది. లియోనెల్ మెస్సీ వంటి స్టార్ ఆటగాడు ఉన్నప్పటికీ, మొదటి విడత పోటీల్లో అర్జెంటీనా 16 మ్యాచ్‌లు ఆడి కేవలం 16 గోల్స్ చేయగలిగింది. వెనుజులా వంటి సామాన్యమైన జట్టుతో మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకోవడం ఆ జట్టు ప్రమాణాలను దిగజారుతున్నాయనడానికి నిదర్శనం. ఇప్పటికే క్వాలిఫయర్స్ దశ నుంచే బొలీవియా నిష్క్రమించగా, పాయింట్ల జాబితాలో ప్రస్తుతం అర్జెంటీనా అట్టడుగు స్థానంలో ఉంది. పెరూతో పోరును మొదలుకొని, రెండు దశ క్వాలిఫయర్స్‌లో ఆడే అన్ని మ్యాచ్‌ల్లోనూ చెలరేగితేగానీ అర్జెంటీనా ముందంజ వేసే అవకాశం లేదు. ఆసియా చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నామని సిరియా ప్రకటించింది. ఆసీస్‌ను చూసి భయపడడం లేదని తేల్చిచెప్పింది.