క్రీడాభూమి

భారత క్రికెట్ జట్టు షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత క్రికెట్ జట్టు రానున్న రెండుమూడు నెలల్లో తీరిక లేకుండా సిరీస్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో టెస్టు, వనే్డ సిరీస్‌లను విజయవంతంగా ముగించిన విరాట్ కోహ్లీ సేన ఇప్పుడు టి-20 సిరీస్‌కు సిద్ధమవుతున్నది. ఇందులో మొదటి టి-20 ఈనెల 7న రాంచీలో జరుగుతుంది. 10న గౌహతిలో, 13న హైదరాబాద్‌లో మిగతా రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ వెంటనే న్యూజిలాండ్‌ను స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వనే్డ, మరో మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఢీ కొంటుంది. ఈనెల 17న ముంబయిలో మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌తో భారత్‌లో మొదలయ్యే కివీస్ పర్యటన నవంబర్ 7న తిరువనంతపురంలో జరిగే మూడవ, చివరి టి-20తో ముగుస్తుంది. న్యూజిలాండ్‌తో పోరు ముగిసిన తర్వాత పదిరోజుల్లోపలే స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ ఖరారైనట్టు సమాచారం. క్రిక్ ఇన్ఫో తెలిపిన సమాచారం ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో లంక మూడు టెస్టులు, మూడు వనే్డలు మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. నవంబర్ 16న కోల్‌కతాలో మొదలయ్యే మొదటి టెస్టుతో మొదలయ్యే ఈ టూర్ డిసెంబర్ 24న ముంబయిలో జరిగే చివరి, మూడో టి-20 ఇంటర్నేషనల్‌తో ముగుస్తుంది. అదే నెలా చివరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళుతుంది. దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 30న రెండు రోజుల వామప్ మ్యాచ్‌తో దక్షిణాఫ్రికాలో టీమిండియా టూర్ మొదలవుతుంది. అక్కడ మూడు టెస్టులు, ఆరు వనే్డలతోపాటు మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్‌ను కూడా భారత జట్టు ఆడుతుంది. అదే విధంగా మహిళల టూర్ షెడ్యూల్‌ను సైతం అధికారులు ఖరారు చేశారు. దక్షిణాఫ్రికా మహిళలతో భారత మహిళలు మూడు వనే్డలు, ఐదు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడతారు. ఇప్పటికే అవిశ్రాంతంగా సిరీస్‌లు ఆడుతున్న భారత క్రికెట్ జట్టుకు మరో మూడు నెలల పాటు అదే తీరులో తీరిక ఉండదు. వారికి శ్రమ విషయం ఎలా ఉన్నా అభిమానులకు మాత్రం కావాల్సినంత వినోదం.

వివిధ సిరీస్‌ల షెడ్యూల్ ఇదే..

ఆస్ట్రేలియాతో..
అక్టోబర్ 7: రాంచీలో మొదటి టి-20 ఇంటర్నేషనల్, అక్టోబర్ 10: గౌహతిలో రెండో టి-20 ఇంటర్నేషనల్, అక్టోబర్ 13: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మూడో టి-20 ఇంటర్నేషనల్.
న్యూజిలాండ్‌తో..
అక్టోబర్ 17: ముంబయిలో మొదటి వామప్ మ్యాచ్, అక్టోబర్ 19: ముంబయిలో రెండో వామప్ మ్యాచ్.
అక్టోబర్ 22: ముంబయిలో మొదటి వనే్డ, అక్టోబర్ 25: పుణేలో రెండో వనే్డ, అక్టోబర్ 29: కాన్పూర్‌లో మూడో వనే్డ.
నవంబర్ 1: ఢిల్లీలో మొదటి టి-20, నవంబర్ 2: రాజ్‌కోట్‌లో రెండో టి-20, నవంబర్ 7: తిరువనంతపురంలో మూడో టి-20.
శ్రీలంకతో..
నవంబర్ 16-20: మొదటి టెస్టు (కోల్‌కతా), నవంబర్ 24-28: రెండో టెస్టు (నాగపూర్), డిసెంబర్ 2-6: మూడో టెస్టు (్ఢల్లీ).
డిసెంబర్ 10: మొదటి వనే్డ (్ధర్మశాల), డిసెంబర్ 13: రెండో వనే్డ (మొహాలీ), డిసెంబర్ 17: మూడో వనే్డ (విశాఖపట్నం).
డిసెంబర్ 20: మొదటి టి-20 ఇంటర్నేషనల్ (కటక్), డిసెంబర్ 22: రెండో టి-20 ఇంటర్నేషనల్ (ఇండోర్), డిసెంబర్ 24: మూడో టి-20 ఇంటర్నేషనల్ (ముంబయి).
దక్షిణాఫ్రికాతో..
ఫురుషుల జట్టు
డిసెంబర్ 30-31: రెండు రోజుల వామప్ మ్యాచ్ (బొలాండ్ పార్క్, పార్ల్).
జనవరి 5-9: మొదటి టెస్టు (న్యూలాండ్స్, కేప్ టౌన్), జనవరి 13-17: రెండో టెస్టు (సెంచూరియన్), జనవరి 24-28: చివరిదైన మూడో టెస్టు (వాండరర్స్, జొహానె్నస్‌బర్గ్).
ఫిబ్రవరి 1: మొదటి వనే్డ (కింగ్స్‌మీడ్, డే/నైట్), ఫిబ్రవరి 4: రెండో వనే్డ (సెంచూరియన్), ఫిబ్రవరి 7: మూడో వనే్డ (న్యూలాండ్స్, కేప్‌టౌన్, డే/నైట్), ఫిబ్రవరి 10: నాలుగో వనే్డ (వాండరర్స్, జొహానె్నస్‌బర్గ్. డే/నైట్), ఫిబ్రవరి 13: ఐదో వనే్డ (సెయింట్ జార్జెస్ పార్క్, పోర్ట్ ఎలిజబెత్, డే/నైట్), ఫిబ్రవరి 16: ఆరో వనే్డ (సెంచూరియన్, డే/నైట్).
ఫిబ్రవరి 18: మొదటి టి-20 ఇంటర్నేషనల్ (జొహానె్నస్‌బర్గ్), ఫిబ్రవరి 21: రెండో టి-20 ఇంటర్నేషనల్ (సెంచూరియన్, డే/నైట్), ఫిబ్రవరి 24: మూడో టి-20 (కేప్ టౌన్, డే/నైట్).
మహిళల జట్టు
ఫిబ్రవరి 5: మొదటి వనే్డ (డైమండ్ ఓవల్, కింబర్లీ), ఫిబ్రవరి 7: రెండో వనే్డ (డైమండ్ ఓవల్, కింబర్లీ), ఫిబ్రవరి 10: మూడో వనే్డ (సెయింట్ సెనె్వస్ పార్క్, పొచెస్ట్రూమ్).
ఫిబ్రవరి 13: మొదటి టి-20 ఇంటర్నేషనల్ (సెయింట్ సెనె్వస్ పార్క్, పొచెస్ట్రూమ్), ఫిబ్రవరి 16: రెండో టి-20 ఇంటర్నేషనల్ (బఫెలో పార్క్, ఈస్ట్ లండన్), ఫిబ్రవరి 18: మూడో టి-20 ఇంటర్నేషనల్ (వాండరర్స్, జొహానె్నస్‌బర్గ్), ఫిబ్రవరి 21: నాలుగో టి-20 ఇంటర్నేషనల్ (సెంచూరియన్), ఫిబ్రవరి 24: ఐదో టి-20 ఇంటర్నేషనల్ (కేప్ టౌన్).