క్రీడాభూమి

టోర్నమెంట్ కబుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభమయ్యే ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
* కేంద్ర క్రీడా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), మాజీ ఒలింపియన్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గురువారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అండర్-17 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ ఈ స్టేడియంలో తొలి మ్యాచ్‌ని అమెరికాతో ఆడుతుంది.
* అండర్-17 వరల్డ కప్ ప్రారంభోత్సవాన్ని అట్టహాంగా నిర్వహించవద్దని ఎఐఎఫ్‌ఎఫ్ అధికారులకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా స్పష్టం చేసింది. ప్రారంభోత్సవాన్ని సాధ్యమైనంత వరకూ సాదాసీదాగా నిర్వహించాలని సూచించింది. ఆడంబరాలకు వెచ్చించాలని అనుకున్న మొత్తాలను దేశంలో సాకర్ అభివృద్ధికి, యువ ఆటగాళ్లకు ఉత్తమ శిక్షణ ఇప్పించడానికి ఖర్చు చేయాలని హితవు పలికింది. దీనితో శుక్రవారం నాటి ప్రారంభోత్సవం ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఒక సాధారణ వేడుగా జరగనుంది.
* ఆరు కాన్ఫడరేషన్స్ నుంచి మొత్తం 24 జట్లు ఈ టోర్నమెంట్‌లో పోటీపడుతున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌తోపాటు అమెరికా, కొలంబియా, ఘనా దేశాలు ఉన్నాయి. గ్రూప్ ‘బి’ నుంచి పరాగ్వే, మాలీ, న్యూజిలాండ్, టర్కీ, గ్రూప్ ‘సి’ నుంచి ఇరాన్, గునియా, జర్మనీ, కోస్టారికా, గ్రూప్ ‘డి’ నుంచి ఉత్తర కొరియా, నిగెర్, బ్రెజిల్, స్పెయిన్, గ్రూప్ ‘ఇ’ నుంచి హోండురాస్, జపాన్, న్యూజి కలెడొనియా, ఫ్రాన్స్, గ్రూప్ ‘ఎఫ్’ నుంచి ఇరాక్, మెక్సికో, చిలీ, ఇంగ్లాండ్ జట్లు ఢీ కొంటాయి.