క్రీడాభూమి

నైజీరియా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అండర్-17 సాకర్ ప్రపంచ కప్‌రికార్డుల విషయానికి వస్తే, టోర్నమెంట్‌ను ఎక్కువ పర్యాయాలు సాధించిన ఘనత నైజీరియాకు దక్కుతుంది. ఆ జట్టు ఐదుసార్లు (1985, 1993, 2007, 2013, 2015) ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అంతేగాక 1987, 2001, 2009 సంవత్సరాల్లో రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఇంత ఘన చరిత్ర ఉన్న నైజీరియా ఈసారి భారత్‌లో జరిగే ఈవెంట్‌కు అర్హత సంపాదించలేకపోవడం దురదృష్టకరం. బ్రెజిల్ మూడుసార్లు (1997, 1999, 2003), ఘనా (1991, 1995), మెక్సికో (2005, 2011) చెరి రెండుసార్లు అండర్-17 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచాయి. ఇక, ఒకప్పటి సోవియట్ యూనియన్ (1987), సౌదీ అరేబియా (1989), ఫ్రాన్స్ (2001), స్విట్జర్లాండ్ (2009) ఒక్కోసారి టైటిల్ సాధించాయి. వరుసగా ఎక్కువ పర్యాయాలు ఫైనల్ చేరిన జట్టుగా ఘనా రికార్డు నెలకొల్పింది. ఆ జట్టు 1991, 1993, 1995, 1997 సంవత్సరాల్లో అండర్-17 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 1991, 1995 సంవత్సరాల్లో టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-17 వరల్డ్ కప్‌లో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకూ 12 మంది ఆటగాళ్లు ఆ తర్వాతి కాలంలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ ఆడడం విశేషం. ఈ విధంగా అటు అండర్-17, ఇటు ఫిఫా వరల్డ్ కప్‌లోనూ ఆడిన క్రీడాకారుల్లో కేవలం ముగ్గురు, మరియో గొజే, ఇమాన్యుయెల్ పెటి, ఆండ్రియాస్ ఇనీస్టా, మాత్రమే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో గోల్స్‌ను నమోదు చేయగలిగారు. కాగా, కౌకీ బెన్ సాదా, నెవెన్ సబొటిక్, విక్టర్ మోజెస్, టామీ స్మిత్, హసన్ యెదా వంటి ఆటగాళ్లు అండర్-17లో ఒక జట్టుకు, ఫిఫా వరల్డ్ కప్‌లో మరో జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
మొట్టమొదటి అండర్-17 వరల్డ్ కప్ 1985లో జరిగింది. 16 జట్లు పాల్గొన్నాయి. మొత్తం 32 మ్యాచ్‌ల్లో 91 గోల్స్ నమోదయ్యాయి. మార్సెల్ విజెక్ ఎనిమిది గోల్స్ సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెస్ట్ ప్లేయర్ అవార్డును విలియమ్స్ దక్కించుకున్నాడు.
మొదటి టోర్నీని మినహాయిస్తే, మూడు పర్యాయాలు ఎక్కువ సంఖ్యలో జట్లు అరంగేట్రం చేశాయి. 1987, 1989, 2007 సంవత్సరాల్లో ఏడేసి జట్లు చొప్పున అండర్-17 వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టాయి. మొత్తం నాలుగు పర్యాయాలు మాత్రమే ఫైనల్స్ నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. 1987, 1989, 1999, 2007 సంవత్సరాల్లో ఈ విధంగా షెడ్యూల్డ్ టైమ్‌లో ఫలితం తేలకపోవడంతో, మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీల ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఇలావుంటే, ఒకసారి టైటిల్ సాధించిన జట్టు దానిని నిలబెట్టుకున్న సందర్భాలు రెండు మాత్రమే. బ్రెజిల్ 1997లో ఈజిప్టులో అండర్-17 వరల్డ్ కప్‌ను గెల్చుకొని, తిరిగి 1999లో న్యూజిలాండ్‌లో టోర్నీ జరిగినప్పుడు కూడా విజేతగా నిలిచింది. అదే విధంగా నైజీరియా 2013 (యుఎఇ)లో టైటిల్‌ను అందుకొని, 2015 (చిలీ)లో దానిని నిలబెట్టుకుంది. కాగా, ఒకే కానె్ఫడరేషన్‌కు చెందిన రెండు జట్లు ఫైనల్‌లో రెండు పర్యాయాలు తలపడ్డాయి. 1993లో ఘనా, నైజీరియా జట్లు, 2015లో నైజీరియా, మాలీ జట్లు ఫైనల్‌లో టైటిల్ కోసం పోటీపడ్డాయి. ంగంబా మీటెయ్, అమర్జిత్ సింగ్ కియామ్, అభిజిత్ సర్కార్, కోమల్ థాటల్, లాలెంగ్‌మవియా, జీక్సన్ సింగ్, నందాంబ నవోరెమ్, రాహుల్ కనోలీ ప్రవీణ్, మహమ్మద్ షార్జహాన్.
ఫార్వర్డ్స్: రహీం అలీ, అనికేత్ జాధవ్.

* అండర్-17 వరల్డ్ కప్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. 1985 నుంచి 2005 వరకూ ఈ టోర్నమెంట్‌లో 16 జట్లు పాల్గొనేవి. ఈ జట్లను నాలుగేసి జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించేవారు. 2007 నుంచి మరో ఎనిమిది జట్లు అదనంగా చేరాయి. దీనితో అండర్-17 వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్య 24కు పెరిగింది. ఇందులో అత్యధిక పర్యాయాలు పోటీపడిన జట్టు రికార్డును అమెరికా, బ్రెజిల్ పంచుకుంటున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 15 పర్యాయాలు ఈ టోర్నీలో ఆడాయి. వారికి ఇది 16వ అండర్-17 వరల్డ్ కప్. విచిత్రంగా, ఆసియా ఖండంలోనే ఈ పోటీలు ఎక్కువసార్లు జరిగాయి. అమెరికా, ఐరోపా ఖండాల్లో ఫుట్‌బాల్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. అభిమానులతో స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. కానీ, అండర్-17 వరల్డ్ కప్ పట్ల ఆసియా దేశాలు ఎక్కువగా కస్తిని ప్రదర్శిస్తున్నాయి. 1985లో చైనా, 1993లో జపాన్, 2007లో దక్షిణ కొరియా, 2013లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ‘యువ వరల్డ్ కప్’కు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పుడు భారత్‌లో పోటీలు శుక్రవారం నుంచి మొదలవుతాయి.

21 మంది సభ్యులతో కూడిన
భారత జట్టు ఇదే..
గోల్‌కీపర్లు: ధీరజ్ సింగ్, ప్రభుసుఖాన్ గిన్, సన్నీ ధలీవాల్.
డిఫెండర్లు: బోరిస్ సింగ్, జితేంద్ర సింగ్, అన్వర్ అలీ, సంజీవ్ స్టాలిన్, హెండ్రీ ఆంథోనీ, నమిత్ దేశ్‌పాండే.
మిడ్‌ఫీల్డర్లు: సురేష్ సింగ్, నింత