క్రీడాభూమి

రంజీకి స్టార్ల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రంజీ ట్రోఫీ క్రికెట్‌కు మళ్లీ స్టార్ల కళ వచ్చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన చాలా మంది క్రికెటర్లు రంజీలో ఆడడాన్ని చిన్నతంగా భావించేవారు. దీనితో ద్వితీయ శ్రేణి క్రికెటర్లు లేదా జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లకు మాత్రమే రంజీ పరిమయ్యేది. కానీ, కాంట్రాక్టులో ఉన్న వారంతా విధిగా రంజీ ట్రోఫీలో ఆడాలని ఇటీవలే బిసిసిఐ ఆదేశాలు జారీ చేసింది.
ఏదైనా అంతర్జాతీయ సిరీస్ లేదా టోర్నీలో ఆడుతున్న లేదా శిక్షణలో ఉన్న వారిని మినహాయించింది. కాగా, వచ్చే నెల వరకూ టెస్టు సిరీస్ లేకపోవడంతో, రవిచంద్రన్ అశ్విన్, చటేశ్వర్ పుజరా, మురళీ విజయ్, అభినవ్ ముకుంద్ వంటి పలువురు జాతీయ స్టార్లు శుక్రవారం నుంచి మొదలయ్యే రంజీ ట్రోఫీలో ఆడనున్నారు.