క్రీడాభూమి

సాకర్ వరల్డ్ కప్ 2018కు జర్మనీ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 6: డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హతను సంపాదించింది. ఇక్కడ జరిగిన కీలక క్వాలిఫయర్‌లో ఈ జట్టు నార్తన్ ఐర్లాండ్‌ను 3-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ రెండో నిమిషంలోనే సెబాస్టియన్ రూడీ ద్వారా జర్మనీకి తొలి గోల్ లభించింది. ఆతర్వాత కూడా అదే దూకుడును కొనసాగించిన జర్మనీ 21వ నిమిషంలో రెండో గోల్ సాధించింది. ప్రత్యర్థి రక్షణ వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకు దూసుకెళ్లిన సాండ్రో వాగ్నర్ చక్కటి ఫీల్డ్ గోల్ చేశాడు. రెండు గోల్స్ ఆధిక్యంలో నిలవడంతో, వేగాన్ని తగ్గించిన జర్మనీ డిఫెన్స్ వ్యూహాన్ని అనుసరించింది. ఫలితంగా ప్రథమార్ధంలో మరో గోల్ నమోదుకాలేదు. ద్వితీయార్ధంలోనూ జర్మనీ వ్యూహం మారలేదు. నార్తన్ ఐర్లాండ్ ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకుంది. మ్యాచ్ చివరి దశకు చేరుకున్న సమయంలో జాషువా కిమిచ్ జర్మనీ ఖాతాలోకి మూడో గోల్‌ను చేర్చాడు. ఇంజురీ టైమ్‌లో జొష్ మగెనిస్ నార్తన్ ఐర్లాండ్‌కు ఓ కంటి తుడుపు గోల్‌ను అందించాడు. క్వాలిఫయర్స్‌లో జర్మనీ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లనూ గెలవడం విశేషం.
ఇంగ్లాండ్ కూడా..
ఇంగ్లాండ్ కూడా 2018 సాకర్ వరల్డ్ కప్‌లో ఆడే అర్హతను సంపాదించింది. స్లొవేనియాతో జరిగిన చివరి క్వాలిఫయర్‌లో ఆ జట్టు 1-0 తేడాతో గెలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి దాదాపు చివరి వరకూ ఇరు జట్లు పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో గోల్స్ నమోదు కాలేదు. అయితే, ఈసారి పోటీల్లో పలుమార్లు చివరి క్షణాల్లో గోల్స్ చేసి జట్టును గెలిపిస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ హారీ కేన్ మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. మ్యాచ్ 89వ నిమిషంలో గోల్ చేసి, ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించాడు.

చిత్రం.. ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించిన జర్మనీ జట్టు