క్రీడాభూమి

బెయిల్‌పై షాదత్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, డిసెంబర్ 8: ఇంట్లో పని మనిషిని చిత్ర హింసలకు గురి చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హొస్సేన్ సోమవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఢాకా హైకోర్టు అతనికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈఏడాది అక్టోబర్ మూడో తేదీ అర్థరాత్రి సమయంలో షాదత్ ఇంట్లో పని చేస్తున్న 11 ఏళ్ల బాలిక రోడ్డుపై ఏడుస్తూ కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం షాదత్, అతని భార్యపై కేసు నమోదు చేశారు. అక్టోబర్ నాలుగున వీరిని పోలీసులు అరెస్టు చేశాడు. ఈనెల ఒకటో తేదీన షాదత్ భార్యకు బెయిల్ లభించింది. వారం రోజుల తర్వాత షాదత్ కూడా బెయిల్‌పై విడుదలయ్యాడు.