క్రీడాభూమి

అండర్-17 సాకర్ వరల్డ్ కప్ బ్రెజిల్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, అక్టోబర్ 7: అండర్-17 సాకర్ వరల్డ్ కప్ ఫేవరిట్స్‌లో ఒకటైన బ్రెజిల్ బోణీ చేసింది. ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన స్పెయిన్‌ను 2-1 తేడాతో ఓడించి సత్తా చాటింది. పాలిన్హో కీలక గోల్ చేసి, బ్రెజిల్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే బ్రెజిల్ ఆటగాడు వెస్లీ పొరపాటు ఓన్ గోల్ చేయడంతో, స్పెయిన్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, ఆ వెంటనే సర్దుకున్న బ్రెజిల్ వ్యూహాత్మకంగా ఆడుతూ, స్పెయిన్‌ను ఆత్మరక్షణలోకి నెట్టింది. 25వ నిమిషంలో లింకన్ కోరెయా డస్ సాంటోస్ ద్వారా బ్రెజిల్‌కు ఈక్వెలైజర్ లభించింది. మరో 20 నిమిషాల పోరాటం తర్వాత పాలిన్హో చక్కటి ఫీల్డ్ గోల్ చేయడంతో బ్రెజిల్ ఆధిక్యం 2-1కి పెరిగింది. అదే తేడాతో ఆ జట్టు మ్యాచ్‌ని ముగించింది.
గోవాలోని పండిత్ జవహరల్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మరో ఫేవరిట్ జట్టు జర్మనీ 2-1 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. రెండు జట్లు మొదటి నుంచి రక్షణాత్మక ఆటకు పరిమితం కావడంతో మ్యాచ్ మండగొడిగా సాగింది. 21వ నిమిషంలో జాన్ ఫిటే ఎఆర్‌పి గోల్ చేసి, జర్మనీ ఖాతా తెరిచాడు. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదుకాలేదు. ద్వితీయార్ధంలోనూ మితిమీరిన డిఫెన్స్ ప్లే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. 64వ నిమిషంలో ఆండ్రెస్ గోమెజ్ గోల్ చేయడంతో, కోస్టారికా ఊపిరి పీల్చుకుంది. కానీ, ప్రొఫెషనల్ ఆటకు మారుపేరైన జర్మనీ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా మ్యాచ్‌ని కొనసాగించింది. 89వ నిమిషంలో నోవా అవుకూ చేసిన గోల్‌తో 2-1 ఆధిక్యాన్ని సంపాదించిన జర్మనీ అదే తేడాతో విజయం సాధించింది.
ఇతర మ్యాచ్‌ల్లో ఇరాన్, నిగెర్ జట్లు తమతమ ప్రత్యర్థులను ఓడించాయ. గునియాతో తలపడిన ఇరా న్ 3-1 తేడాతో గెలిచింది. ప్రథమార్ధం ఒక్క గోల్ కూడా లేకుండా ముగియగా, ద్వితీయార్ధంలో చెలరేగిన ఇరాన్ మూడు గోల్స్ చేసింది. 58వ నిమిషంలో అల్లాయార్ సయాద్, 70వ నిమిషంలో మహమ్మద్ షరిఫీ, 90వ నిమిషంలో సయద్ కరీమీ ద్వారా ఇరాన్‌కు గోల్స్ లభించాయ. గునియాకు ఇంజురీ టైమ్‌లో ఫజే టొరో గోల్‌ను అందించాడు.
ఉత్తర కొరియాతో తలపడిన నిగెర్ 1-0 తేడాతో విజయం సాధించింది. కీలకమైన ఈ గోల్‌ను సలీం అబ్దుర్‌మనే నమోదు చేశాడు.
*
నేటి మ్యాచ్‌లు
గౌహతి: ఇందిరా గాంధీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు న్యూ కలెడోనియా/ ఫ్రాన్స్, రాత్రి 8 గంటలకు హోండురాస్, జపాన్ జట్లు ఢీ కొంటాయి.
కోల్‌కతా: వివేకానంద యువ భారతి క్రీడాంగణ్‌లో సాయంత్రం 5 గంటలకు చిలీ/ ఇంగ్లాండ్, రాత్రి 8 గంటలకు ఇరాక్/ మెక్సికో జట్లు తలపడతాయి.

చిత్రం.. బ్రెజిల్‌ను గెలిపించిన పాలిన్హో