క్రీడాభూమి

రిటైర్మెంట్ యోచనలో నెహ్రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడని సమాచారం. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారి పిటిఐతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం, రిటైర్మెంట్‌పై నెహ్రా ఇప్పటికే జట్టు కోచ్ రవి శాస్ర్తీకి, కెప్టెన్ విరాట్ కోహ్లీకి తెలిపాడు. హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా (్ఢల్లీ) మైదానంలో నవంబర్ ఒకటిన న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. ఆ మ్యాచ్‌తోనే కెరీర్‌ను ముగించాలని నెహ్రా నిశ్చయించుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు 38 ఏళ్ల నెహ్రాను ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. రాబోయే ప్రపంచ కప్, ఇతర కీలక టోర్నీలను దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లను ప్రోత్సహించకుండా నెహ్రా లాంటి వెటరన్‌ను తీసుకోవడం ఏమిటన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే, మొదటి రెండు టి-20 మ్యాచ్‌ల్లో తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్‌లో అతను ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఆ జట్టులోనూ చోటు లభించినా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో నెహ్రాకు ప్లేయింగ్ ఎలెవెన్‌లో అవకాశం దక్కడం అనుమానంగానే ఉంది. అన్నింటినీ మించి, 2018లో భారత్‌కు అంతర్జాతీయ టి-20 మ్యాచ్‌లను ఐసిసి కేటాయించలేదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, గౌరవంగా వైదొలిగితేనే మంచిదని నెహ్రా భావిస్తున్నట్టు తెలుస్తున్నది.