క్రీడాభూమి

స్టోక్స్ లేకపోతే కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, అక్టోబర్ 12: బెన్ స్టోక్స్ ఉంటేనే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ గెల్చుకుంటుందా? అతను లేకపోతే, రాబోయే ఆ సిరీస్‌లో చేతులెత్తేస్తుందా? ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అభిప్రాయం ప్రకారం ఆల్‌రౌండర్ స్టోక్స్ లేకపోతే ఇంగ్లాండ్ జట్టు బాగా బలహీన పడుతుంది. యాషెస్ సిరీస్ కోసం ఈనెల 28న ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ జట్టు బయలుదేరుతుంది. ఈ సిరీస్‌కు ఎంపికైన జట్టులో స్టోక్స్‌కు కూడా చోటు లభించింది. అయితే, ఇటీవలే ఒక నైట్ క్లబ్ వద్ద ఘర్షణ పడి, కొంత మందిపై దాడి చేసిన సంఘటనలో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదల చేసినప్పటికీ, విచారణ కొనసాగుతున్నది. అందుకే, జట్టులోని మిగతా సభ్యులతో కలిసి అతను ఆస్ట్రేలియాకు బయలుదేరడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని స్టీవ్ వా ప్రస్తావిస్తూ, ఒకవేళ యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ ఆడలేకపోతే, ఇంగ్లాండ్ ఓటమి తథ్యమని అన్నాడు. మొత్తం మీద ఈ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని జోస్యం చెప్పాడు.