క్రీడాభూమి

ఇక టెస్టు, వనే్డ లీగ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్, అక్టోబర్ 13: తొమ్మిది జట్లతో టెస్టు, 13 జట్లతో వనే్డ లీగ్స్‌ను నిర్వహించాలన్న ప్రతిపాదనలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆమోద ముద్ర వేసింది. 2019లో టెస్టు లీగ్‌ను, 2020లో వనే్డ లీగ్‌ను మొదలుపెట్టాలని ఇక్కడ జరిగిన కీలక సమావేశంలో ఐసిసి నిర్ణయించింది. టెస్టు లీగ్‌లో తొమ్మిది జట్లు రెండేళ్ల కాలంలో ఆరు సిరీస్‌లు ఆడతాయి. వీటిలో మూడింటిని స్వదేశంలో, మరో మూడింటిని విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. ఒక్కో జట్టుకు కనీసం రెండు, అత్యధికంగా ఐదు టెస్టులు ఆడే అవకాశం దక్కుతుంది. ఇక వనే్డ లీగ్ విషయానికి వస్తే, ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా ఐసిసి ప్రపంచ కప్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వరల్డ్ కప్‌లో పూర్తి సభ్యత్వం ఉన్న 12 జట్లకు అదనంగా వనే్డ లీగ్ చాంపియన్ జట్టు చేరుతుంది.
నాలుగు రోజుల టెస్టు
టెస్ట క్రికెట్ ఆడే విధానంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో, ఎక్కువ శాతం మ్యాచ్‌లో ఐదు రోజుల్లోపే ముగుస్తున్నాయి. పైగా పరిమిత ఓవర్ల పార్మాట్లు తెరపైకి వచ్చిన తర్వాత, ఫలితం తేలుతుందో లేదో కూడా తెలియని ఒక టెస్టును ఐదు రోజుల పాటు చూసేందుకు చాలా మంది ఉత్సాహం చూపించడం లేదు. దీనితో టెస్టులను ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు ఐసిసి కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగానే నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను ప్రయోగాత్మకంగా ఆడించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టును నాలుగు రోజుల మ్యాచ్‌గా మార్చింది. ఐసిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ టెస్టు డిసెంబర్ 26 నంచి 29వ తేదీ వరకు జరుగుతుంది.