క్రీడాభూమి

వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌కు షకీబ్, డివిలియర్స్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింబర్లీ (దక్షిణాఫ్రికా), అక్టోబర్ 14: మూడు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌కు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్‌హసన్, దక్షిణాఫ్రికా సూపర్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ సిద్ధంగా ఉన్నాడు. డైమండ్ ఓవల్‌లో ఆదివారం తొలి మ్యాచ్ జరగనుండా, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పరాజయాన్ని చవిచూసిన బంగ్లాదేశ్ వనే్డ సిరీస్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నది. షకీబ్ చేరికతో ఆ శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. అయితే, ప్రపంచ అత్యుత్తమ స్ట్రోక్ ప్లేయర్స్‌లో ఒకడైన డివిలియర్స్ జట్టులోకి రావడంతో బలాన్ని పుంజుకున్న దక్షిణాఫ్రికాను ఎంత బంగ్లాదేశ్ ఎంత వరకూ కట్టడి చేస్తుందనేది అనుమానంగా కనిపిస్తున్నది. ఇటీవలే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్‌రౌండర్ జీన్ పాల్ డుమినీ వనే్డల్లో ఆడనుండడం దక్షిణాఫ్రికాను సూపర్ పవర్‌గా మారుస్తున్నది. అతను ఫామ్‌లోకి వస్తే, బంగ్లాదేశ్‌కు సమస్యలు తప్పవు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్ వనే్డ సిరీస్‌లో గట్టిపోటీని ఇవ్వడానికి అన్ని విధాలా పోరాడనున్న నేపథ్యంలో, మూడు మ్యాచ్‌లూ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలున్నాయి. వనే్డ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది వాస్తవం. ఈ ఏడాది జూన్ మాసంలో, ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరింది. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. 2015లో స్వదేశంలో జరిగిన వనే్డ సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన అనుభవం కూడా బంగ్లాదేశ్‌కు ఉంది. ఇప్పుడు పోరు దక్షిణాఫ్రికాలో కాబట్టి, బంగ్లాదేశ్ అద్భుత విజయాలను నమోదు చేస్తుందని ఊహించలేం. కానీ, గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. గణాంకాలను పరిశీలిస్తే, బంగ్లాదేశ్‌పై 17 వనే్డల్లో 14 విజయాలను సాధించిన దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. వెటరన్ బౌలర్ మష్రాఫ్ మొర్తాజా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌ను ఓడించి వనే్డ సిరీస్‌ను కూడా దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంటుందని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు.